Telugu News

ఖమ్మంలో ఎంపీలకు అడుగడుగున నిరాజనం

తెరాస పార్టీలో ఫుల్ జోష్

0

ఎంపీలకు అడుగడుగున నిరాజనం

== జిల్లా సరిహద్దులో రాజ్యసభసభ్యులకు ఘనస్వాగతం

== ఎంపీ నామా, ప్రభుత్వ విఫ్ రేగా, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యే కందాళ హాజరు

== మోటర్ సైకిళ్లు, కార్లతో భారీ ర్యాలీ

==  జిల్లా సరిహద్దు నుంచి సభా స్థలి స్టేడియం వరకు భారీ కాన్వాయ్

==  తెరాస పార్టీలో ఫుల్ జోష్

కూసుమంచి, జూన్ 18(విజయంన్యూస్)

రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా ఖమ్మం జిల్లా కు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి రెడ్దిలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అడుగడుగున నిరాజనాలు పలికారు.  జిల్లా సరిహద్దు ప్రాంతమైన కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం వద్ద తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

allso read- పల్లె ప్రగతితో శరవేగంగా అభివృద్ధి :మంత్రి

 ఖమ్మం ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో ఎంపీ నామానాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి,  ప్రభుత్వ చిఫ్ విఫ్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వద్దిరాజు రవించంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఖమ్మం ఎం పీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విజయ చిహ్నం చూపారు. పాలేరు ఎమ్మెల్యే కందాల.ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సుమారు 500ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా నాయకన్ వరకు ఘన స్వాగతం పలికేందుకు తరలివచ్చారు.  ద్విచక్రవాహన ర్యాలీ లో ఎమ్మెల్యే స్వయంగా బుల్లెట్ నడిపి ర్యాలీ గా వెళ్ళారు.

allso read-ప్రజల మన్నన్నలను పొందిన తహసీల్దార్ శిరీషా

కాగా నియోజకవర్గం నుండే కాకుండా జిల్లా వ్యాప్తంగా తెరాస శ్రేణులు నాయకన్గూడెం వద్దకు చేరుకున్నారు. జిల్లా సరిహద్దుకు రాజ్యసభ సభ్యులు రావడంతోనే వందలాధి  బాణాసంచాలు కాల్చి, జై కెసిఆర్, జై తెలంగాణ, జై కందాల అంటూ నినాదాలు హోరేత్తించారు. ర్యాలీ మండల కేంద్రం చేరుకోగానే తుమ్మల అనుచరులు ప్రచారథం ఎక్కి ఖమ్మం వెళ్లారు.  ప్రధాన కేంద్రంలో కూడ జై తుమ్మల అంటూ నినాదాలు ఇవ్వగా దానికి పోటీగా భారీ సంఖ్యలో అక్కడ ఉన్న కందాల అభిమానులు జై కందాల, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో నెలకొండ పల్లి, కూసుమంచి తెరాస శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మద్దులపల్లి వద్ద గజ మాలతో సత్కరించారు. గులాబి రంగు పేపర్స్ చల్లుతూ రాలీ ముందుకు సాగింది. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డు లో రెండు చోట్ల గజమాలతో సత్కరించారు. ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహణ కమిటీ కోరికా మేరకు ఎంపిరవిచంద్ర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. జై కేసీ ఆర్, జై కేటీఅర్ .. జై తెలంగాణ అంటూ నినదించారు. టపాసుల మోతలు మిన్నంటాయి. ఖమ్మం నగరం మయూరి సెంటర్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. జెడ్పీ సెంటర్ లో గుర్రాలు, కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ గజ మాలతో స్వాగతం పలికారు. డప్పులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. వైరా రోడ్డు మీదుగా కోలాటం, డప్పు లతో సభ స్థలి సర్దార్ పటేల్ స్టేడియం వరకు కొనసాగింది.