Telugu News

రాజుపేటలో మండలాధికారులు ఆకస్మీకంగా తనిఖీ

కూసుమంచి-విజయంన్యూస్)

0
రాజుపేటలో మండలాధికారులు ఆకస్మీకంగా తనిఖీ
(కూసుమంచి-విజయంన్యూస్)
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్వగ్రామమైన కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో పలు ప్రభుత్వ ఆపీసులను ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీవో రామచంద్రయ్యలు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన వారు రికార్డులను పరిశీలించారు. పలు సమస్యలుండగా పంచాయతీ కార్యదర్శి పార్వతికి సూచనలు చేశారు. అలాగే పంచాయతీకి సంబంధించిన నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై కార్యదర్శికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ప్రాథమిక అరోగ్యఉపకేంద్రాన్ని వారు పరిశీలించారు. అక్కడ బీపీ, షుగర్ టెస్టులు చేయించుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కరెంట్ సప్లే లేదని చెప్పగా వెంటనే కార్యదర్శికి ఆదేశించారు. రేపటికల్లా విద్యుత్ సరఫరా పూర్తి కావాలని సూచించారు.
అలాగే ఆశావర్కర్లు కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తద్వారా గిరిజన తండాలకు వెళ్లాలంటే రవాణాసౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని సీనియర్ ఏఎన్ఎం ఎంపీడీవో కు వినతి చేశారు. దీంతో స్పందించిన ఎంపీడీవో మెడికల్ ఆపీసర్ తో మాట్లాడి నాకు ఒక వినతి ఇవ్వాలని, దానిని కలెక్టర్ కు పంపించి వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని హామినిచ్చారు. అనంతరం రాజుపేట అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ రోజు మెను ప్రకారం కూరలు ఉన్నాయాలేదా అని పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడారు. గుడ్లు పెడుతున్నారా అని అడగ్గా రోజు పెడుతున్నారని, పాఠాలు చెబుతున్నారా అని అడిగితే పాటలు పాడి ఎంపీడీవోకు వినిపించారు. అనంతరం అంగన్ వాడీ కేంద్రం చాలా బాగుందని, చుట్టు పెంచుతున్న మొక్కలు చాలా బాగున్నాయని ఎంపీడీవో అంగన్ వాడీ టీచర్ రేణుకను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు.