Telugu News

కూసుమంచి లో వీఆర్ఏల సమ్మె సైరన్

మూడవరోజు కొనసాగుతున్న సమ్మె

0

కూసుమంచిలో వీఆర్ఏల సమ్మె సైరన్

★★ మూడవ రోజు కొనసాగుతున్న సమ్మె

కూసుమంచి, జులై 27(విజయంన్యూస్)

కూసుమంచి మండలంలోని అందరు వీఆర్ఏలు నిరవధిక సమ్మెకు దిగారు. కూసుమంచి తహసిల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని సమ్మెకు కూర్చున్నారు. బుధవారంకు మూడవరోజు చేరుకుంది.. వీఆర్ఏ మండల అధ్యక్షులు ధారా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మండలంలోని అందరు వీఆర్ఏలము నిరవధిక సమ్మెకు దిగామని అన్నారు. కార్యదర్శి అన్వర్ పాష మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను పరిష్కరించే వరకూ కూడా సమ్మె విరమించేది లేదని అన్నింటికీ సిద్ధమయ్యే సమ్మెకు దిగామని చెప్పారు. వీఆర్ఏలు ఏర్పాటు చేసుకున్న సమ్మె శిబిరాన్ని జిల్లా జేఏసి చైర్మన్ షేక్ అజీజ్, జనరల్ సెక్రెటరీ చల్లా లింగరాజు సందర్శించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి మాతో చర్చించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అప్పటివరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబాబు, మండల ఉపాధ్యక్షులు రమేష్, మండల ట్రెజరర్ రవికుమార్, అనిల్, రమేష్, సుగుణ, నాగమణి, విజయ, మరియమ్మ, కాంతయ్య, వీరబాబు, వెంకన్న,  మహిళా వీఆర్ఏలు, మండలంలోని అందరూ వీఆర్ఏ లు పాల్గొన్నారు.

Allso read:- అడవిబిడ్డలకు అండగా శీనన్న