కూసుమంచి శివాలయం అభివద్దికి సహాకరిస్తాం: నామా, కందాళ
శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కందాళ, ఎంపీ నామా
శివాలయం అభివద్దికి సహాకరిస్తాం
== శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కందాళ, ఎంపీ నామా
కూసుమంచి-విజయంన్యూస్)
కాకతీయుల కాలంనాటి పురాతన దేవాలయం కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయంను అభివద్ది చేసేందుకు తమ వంతుగా సహాకరిస్తామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హామినిచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కూసుమంచి శివాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా పూజలు చేశారు.
ఇది కూడా చదవండి: కూరపాటి కుటుంబాన్ని ఓదార్చిన నామా
దేవాలయానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను అర్చకులు, దేవదాయశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణకుంబంతో స్వాగతం పలికిన అర్చకులు ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం దేవాలయ చైర్మన్ కొక్కిరేణి వీరస్వామి, ఆలయ మేనేజర్ శ్రీకాంత్, ప్రధాన అర్ఛకుడు శేషగిరి శర్మ ప్రత్యేకంగా ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ దైవచింతనకు మించిన ప్రశాంతత మరొకటి లేదని భక్తులను ఆధ్యాత్మికత వైపు నడిచేలా చేయాలని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయ అభివద్దికి ఎంతవరకు అవసరమో తనను వినియోగించుకోవాలని కోరారు. కచ్చితంగా అభివద్దికి సహాకరిస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెన్నా మోహన్,డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, బిఆర్ఎస్ :మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి వేముల వీరయ్య,ఎండీ. ఆసిఫ్, సీతారాములు, ఉపేందర్, పాలకవర్గ చైర్మన్ కొక్కిరేణి వీరస్వామి .డైరెక్టర్స్, సునీత రవీందర్, రెడ్డిఅర్వపల్లి వెంకటేశ్వర్లు, రామకృష్ణ యదవ్ ,నాగయ్య ముత్తయ్య.గ్రామ ప్రజలు కార్యనిర్వహణ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు
== జీళ్ళచెరువు శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం పూజలు చేసిన నామా
కూసుమంచి మండలంలోని చిన్నతిరుపతిగా పేరుగాంచిన జీళ్ళచెరువు శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, రైతుబంధు కమిటీ జిల్లా అధ్యక్షుడు నలమల వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా పూజలు చేశారు. దేవాలయం వద్దకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలకు అర్చకులు చిలకమర్రి సీతారామానుజచార్యులు, అప్పలచార్యులు, జనార్థన్ చార్యులు, స్వామినాథన్ చార్యులు, దేవాలయ మేనేజర్ చార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ పాలక మండలి చైర్మన్ బూర్లే వీరబాబు, వైస్ చైర్మన్ డాక్టర్ రామాచారి, మాజీ చైర్మన్ బొడ్డు నరేందర్, సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ సభ్యురాలు అంబాలఉమాశ్రీనివాస్, ఉపసర్పంచ్ గోపే హరినాథ్, డిసీసీబీ డైరెక్టర్ శేఖర్ తదితరులు ఎంపీ నామా, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం దేవాలయం ఉత్సవం కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జీళ్ళచెరువు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అంటే నాకు ఎంతో ఇష్టమని, కచ్చితంగా ఈ దేవాలయ అభివద్దికి తమవంతు సహాయం ఉంటుందన్నారు. ప్రభుత్వ పరంగా అభివద్ది కార్యక్రమాలను కచ్చితంగా మంజూరు చేస్తామని హామినిచ్చారు.
ఇది కూడా చదవండి: ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలి: నామా