Telugu News

చింతలతండాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేత

ఆగ్రహం వ్యక్తం చేసిన తండా వాసులు

0

చింతలతండాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేత

== ఆగ్రహం వ్యక్తం చేసిన తండా వాసులు

== ఖండించిన కాంగ్రెస్, వైఎస్ఆర్ టీపీ నాయకులు

== విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసిన నేతలు

== కూసుమంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

కూసుమంచి, అక్టోబర్ 7(విజయంన్యూస్)

స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు.. దీంతో గిరిజన తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఖండించారు. విగ్రహాన్ని నిలబెట్టి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. కూల్చివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూసుమంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన శుక్రవారం చింతలతండాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలంలోని కేశ్వాపురం గ్రామ పంచాయితీ శివారు చింతలతండా గ్రామంలో చేగొమ్మ రోడ్డు సమీపంలో షర్మిళ పాదయాత్రలోని 600 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా వైఎస్ ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చేసి కూల్చివేశారు.

ALLSO READ- కాంగ్రెస్ నుంచి పోటీ చేయండి సార్.. గెలిపిస్తం

తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం చింతలతండాకు చెందిన గిరిజనులు బయటకు వెళ్లుండగా విగ్రహం కిందపడి ఉండటంతో దగ్గరకు పోయి చూసి కూల్చివేశారని గమనించి తండా వాసులు కాంగ్రెస్, వైఎస్ఆర్ టీపీ నాయకులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్, మండల పార్టీ అధ్యక్షుడు వైవిడి రెడ్డి, వూడుగు సుధాకర్, బోయిన కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య, తుపాకుల వెంకన్న, మీరాసాహెబ్, తండాలోని ఉపసర్పంచ్, వైఎస్ఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది మహిళలు కంటతడి పెట్టడం గమనర్హం. మా దేవుడ్ని కూల్చివేశారని, వాళ్లను ఊరికే వదలోద్దని మండిపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న కూసుమంచి ఎస్ఐ నంధీప్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన ఎస్ఐ నంధీప్ ను గిరిజనులు బ్రతిమిలాడారు. దేవుడు లాంటి వైఎస్ఆర్  విగ్రహాన్ని కూల్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలోద్దని, కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ALLSO READ- జీళ్ళచెర్వులో దేవి నిమజ్ఙనంలో  హత్యయత్నం

ప్రభుత్వ భూమిలో వెంచర్ వేసిన ఆ భూమి యజమాని పనేని, ఆయన ఈ విగ్రహాన్ని కూలగొట్టాడని, ఆయన ఈ భూమిలోకి ఎలా వస్తాడో చూద్దామని హెచ్చరించారు. దీంతో స్పందించిన ఎస్ఐ నందీఫ్ మాట్లాడుతూ ఎవరు ఈ విగ్రహాన్ని కూల్చారో వారి పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ఎవరు తొందరపడోద్దని అన్నారు. అనంతరం లక్కినేని సుదీర్ కుమార్, వైవిడి రెడ్డి కూసుమంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విగ్రహాన్ని కూల్చివేసిన స్థలంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలదండలేసి నివాళ్లు అర్పించారు.