Telugu News

కూసుమంచి మండలంలో విషాదం.. రైతు హత్య..

గెట్టు వద్ద పంచాయతీ, ఘర్షణ..

0

కూసుమంచి మండలంలో విషాదం.. రైతు హత్య..

గెట్టు వద్ద పంచాయతీ, ఘర్షణ..
తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి
ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
(కూసుమంచి-విజయం న్యూస్)

కూసుమంచి మండలం లో సోమవారం విషాదం నెలకొంది.. భూ పంచాయతీ ఓ రైతు ప్రాణాలను బలి తీసింది.. భూతగాదాల కారణంగా ఒకరి మృతి చెందగా.. ముగ్గురిపై కేసు నమోదైంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
కూసుమంచి మండలం లోని లింగారంతండా పంచాయతీ పరిధిలోని గన్యా తండాకు చెందిన గూగుల్ లోతు రాంజ్య (75) వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు..కాగా సదరు రైతుతో మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన చిలక బత్తిని రామారావుకు గత కొన్ని సంవత్సరాల నుండి భూమి తగాదా నడుస్తున్నాయి.

also read ;-ట్యాoకర్ పేలి నలుగురు మృతి

ఈ నేపథ్యంలో సోమవారం ఇరువురు వ్యవసాయ భూమి గన్యా తండా వద్ద ఘర్షణ పడ్డారు. నేలపట్ల గ్రామానికి చెందిన చిలక బత్తిని రామారావు, సురేందర్ మరొకరు కలిసి రాంజ్య దాడి చేశారు. దీంతో రాంజ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తండాలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి వెళ్ళగా నిందితులు పరారైయ్యారు. కాగా తన తండ్రిని కొట్టి చంపారని తన కొడుకు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నందిప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ముగ్గురు కూతుళ్ళు.. ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.