Telugu News

ట్రాన్స్ పార్మర్ మార్చండి సార్..

పదిరోజులైనా పట్టించుకుని అధికారులూ..

0

ట్రాన్స్ పార్మర్ మార్చండి సార్..

** కాలిపోయి పదిరోజులైనా పట్టించుకుని అధికారులు

** ఎండుతున్న పంటలు.. ఇబ్బందులు పడుతున్న రైతన్నలు..

(కూసుమంచి-విజయం న్యూస్)

ప్రసుత్తం పంటలు పొట్టదశలో ఉన్నాయి.. ఇప్పుడు ఆ పంటకు ప్రతిరోజు నీళ్ళు కావాలి.. అలా నీళ్ళందిస్తేనే పంట మంచి దిగుబడి వస్తుంది.. ఇలాంటి సమయంలో నీళ్ళందించాల్సిన రైతులు బోరుమంటున్నారు.. మోటర్ కు కావాల్సిన కరెంట్ సప్లే లేదు.. ట్రాన్సాఫార్మర్ కాలిపోయి పది రోజులైంది.. దానిని బాగు చేసే నాధుడేకరువైయ్యారు. పూర్తి వివరాల్లోకే పోతే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి గ్రామ పరిధిలో నాన్ తండా రోడ్ లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫారం కాలిపోయాయి పది రోజులు అవుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్లకు, బావులకు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు కరెంటు లేక వ్యవసాయ పంటలు ఎండిపోతున్నాయి విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫారం రిపేర్ చేయించగలరని రైతులు కోరుతున్నారు.

also read :- తిరుపతిలో విషాద ఘటన