Telugu News

కూసుమంచిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం..

కూసుమంచిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం..

0

కూసుమంచిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం..

రాజ్యంగంపై సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో లో గురువారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచమే గొప్పగా అభివర్ణించిన భారత రాజ్యాంగాన్ని అర్ధరాత్రి మేల్కొని రాజకీయ నాయకుడు సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించడం దురదృష్టకరమని, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యంగాన్ని వ్యతిరేకించటం దుర్మార్గమైన చర్య అని, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన కోరారు.

also read :-*రాజ్యాంగాన్ని కాదు.. కెసిఆర్ నే మార్చాలి : భట్టి

కేసీఆర్ చేసిన వాఖ్యలు భారత ప్రజలను అవమానించినట్లు గా ఉన్నాయని, వెంటనే బాధ్యత సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మధిర ఇంచార్జ్ పెండ్ర అంజయ్య, యువజన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెల్లి శ్రీశైలం, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మునుగంటి రాములు, మండల నాయకులు బండారుపల్లి శ్రీనివాస్, మహ్మద్ కలీమ్, భూపిల్ రెడ్డి‌, ఆలేటి రాంబాబు, నాగన్న, గిరిజన సంఘం బాధ్యులు బానోతు రవి నాయక్, జర్పుల ప్రసన్న, బొంగా నాయక్, నునావత్ బిక్ష్మం నాయక్, గుగులోతు లచ్చు నాయక్, తిరుమలేష్, మహ్మద్ సోయబ్, సంతోష్, సైదా నాయక్, నజీర్ తదితరులు హాజరైయ్యారు్.