Telugu News

కూసుమంచిలో ఘనంగా కాంగ్రెస్ అవిర్భావ దినోత్సవ వేడుకలు

== జెండా ఎగరవేసిన మండల పార్టీ అధ్యక్షుడు

0

కూసుమంచిలో ఘనంగా కాంగ్రెస్ అవిర్భావ దినోత్సవ వేడుకలు
== జెండా ఎగరవేసిన మండల పార్టీ అధ్యక్షుడు
== రెండు వర్గాలుగా విడిపోయి జెండా అవిష్కరణ
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 137వ అవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను మండల కమిటీ అధ్యక్షుడు మట్టెగురవయ్య, మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామసహాయం మాదవిరెడ్డి జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 137 సంవత్సరాల పాటు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి రమేష్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ ప్రధానకార్యదర్శి బెల్లి శ్రీశైలం, నాయకులు మహ్మద్ ఖలీమ్, మధుసూధన్, జర్పుల ప్రసన్నకుమార్, భూపాల్ రెడ్డి, కందుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
== హాఫీజుద్దీన్ నివాసం వద్ద
కూసుమంచి మండల కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహ్మద్ హాఫీజుద్దీన్ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు దాసోజు వెంకన్న కేక్ కట్ చేయగా సీనియర్ నాయకులు దాసరి వెంకన్న పార్టీ జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బెల్లంకొండ ముత్తేశం, చిన్నం సంగయ్య, వనం మధుసూదన్, కనకం మైసయ్య, తుపాకుల వెంకన్న, బెల్లంకొండ కిరణ్, పందిరి సత్యనారాయణ రెడ్డి, చెన్ను వెంకటరమణ, చీమల్దారి గోపి, వడ్త్య నాగేశ్వరరావు, గుండా భూపాల్ రెడ్డీ, బానోత్ బాసూనాయక్, బందేలా కాంతారావ్, దారా సుధాకర్, బానోత్ సైదా నాయక్, షేక్ నాగుల్ మీరా, పేరం మల్లయ్య, షేక్ నాగుల్ మీరా, కట్టా సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

also read;-*కోవిడ్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్