Telugu News

కూసుమంచిలో హాస్పిటల్ ను ప్రారంభించిన ఎంపీపీ

కూసుమంచి-విజయంన్యూస్

0

కూసుమంచిలో హాస్పిటల్ ను ప్రారంభించిన ఎంపీపీ

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండల కేంద్రము లో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి రేఖ హాస్పిటల్ ను కూసుమంచి మండల యంపిపి బానోత్ శ్రీనివాస్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ముందుగా పూజలు చేశారు. ఆసుపత్రిని కలియ తిరిగి కార్పోరేట్ స్థాయిలో ఆసుపత్రి ఉందని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కూసుమంచి మండలానికి చెందిన డాక్టర్ బి.మల్సూరు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ చేసి ఖమ్మం, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్న, లేదంటే ఏదో ఒక ఆసుపత్రిలో పనిచేసిన లక్షల మేర వేతనాలు వచ్చేవని, కానీ స్వంత మండలానికి సేవ చేయాలనే ఆలోచనతో కూసుమంచిలో మంచి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలని, వైద్యనారాయణో హరి అని పెద్దలు అన్నట్లుగా ఆ మాటను సార్థికత చేసుకోవాలని కొనియాడారు. ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసానిచ్చారు.

also read :-★ ప్రజారవాణాకు ఆటంకంకలిగిస్తే ఉక్కుపాదం

పేదలకు తక్కువ ఖర్చులో లాభాపేక్ష కాకుండా సేవమార్గంలో మన మండల ప్రజలకు సేవలందించాలని, తద్వారా మంచి పేరు ప్రఖ్యాతలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చెన్న.మోహన్,యంపిటిసి సభ్యులు మాదాసు.ఉపేందర్, జర్పుల బాలాజీ నాయక్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సేట్రామ్ నాయక్, మాజీ సిడిసి చైర్మన్ జూకురి.గోపాల్ రావు, బారీ వీరభద్రం, విజయం పత్రిక చైర్మన్ పెండ్ర అంజయ్య, డీసీసీబీ డైరెక్టర్ ఐ.శేఖర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, కోఆప్షన్ సభ్యులు అలీ, టీఆర్ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బాలక్రిష్ణ, దామల పాపారావు, అర్వపల్లి జనార్థన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మట్టే గురవయ్య, మాజీ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల పరుశురామ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బానోత్.రామ్ కుమార్, బండారు.శ్రీను తదితరులు పాల్గొన్నారు