Telugu News

షర్మిళ పై మండిపడిన లక్కినేని

ఓ నేతకు రూ.11లక్షలు ఇచ్చినట్లు ప్రకటించిన అధ్యక్షుడు

0

షర్మిళ పై మండిపడిన లక్కినేని

== ఓ నేతకు రూ.11లక్షలు ఇచ్చినట్లు సంచలన ప్రకటన చేసిన అధ్యక్షుడు

== రాష్ట్రంలోని వైఎస్ఆర్ టిపి పార్టీ బ్రష్టుపట్టిపోయిందన్న నేత

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుదీర్ ఆ పార్టీ అధినేత్రి వైఎస్  షర్మిళ, ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ నిర్ణయాలు కరెక్ట్ గా లేవని, ఆమె కొందరు నాయకులపై ఆధారపడి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిళ పర్యటిస్తున్న సమయంలోనే ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ రాజీనామా చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇది కూడా చదవండి: సొమ్మసిల్లి పడిపోయిన వైఎస్ షర్మిళ

గత 7 సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి లో అనేక కార్యక్రమాలు నిర్వహించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్తో ఉన్న అనుబంధంతో వైఎస్ఆర్ కుమారుడి వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఉన్న అభిమానంతో నాడు అధికార పార్టీలో జిల్లా ప్రధానకార్యదర్శి పదవిని వదిలిపెట్టి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరానని, అప్పటి నుండి నేటి వరకు ఎన్నో కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ, కార్యకర్తలను కాపాడుకుంటూ అనేక స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహింస్తూ, ప్రతి కార్యకర్తకు అండగా ఉండి నేటి వరకు జిల్లా అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని అన్నారు. పార్టీకి దిశా నిర్ధేశం చేయటంలో పార్టీ నాయకత్వం విఫలమైనది. రాష్ట్ర పార్టీ నాయకత్వంలో అనేక లుకలుకలు ఉన్నాయని ఆరోపించారు. వారి గొడవలు వలన ఖమ్మం జిల్లా రాజకీయంగా కో – ఆర్డినేటర్లను, పాత మండలాధ్యక్షులను తీసివేస్తూ కొత్తవారికి కనీస రాజకీయ అనుభవం లేనివారికి కో- ఆర్డినేటర్, మండలాధ్యక్షుల పదవులు కట్టబెడుతూ జిల్లాలో పార్టీ పతనానికి కారణమవుతున్నారన్నారు. పార్టీ స్థాపించి రెండున్నర సంవత్సరాలు అయినప్పటికి పార్టీకి రాజకీయ స్వరూపం లేదని,  కొన్నిరోజుల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిలమ్మ మాటలాడిన మాటలు వారి కుటుంబ విషయంలో సునీతకి సపోర్టు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు.  

ఇది కూడా చదవండి: ఖమ్మంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి బిగ్ షాక్..*

7 సంవత్సరాల నుండి పార్టీ బలోపేతం చేయుటకు నా వంతుగా పనిచేసినా, నా సేవలు గుర్తించడంలో పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ విఫలమైయ్యారని ఆరోపించారుజ  వైఎస్ఆర్ కుటుంబం మాట ఇస్తే మడమతిప్పరు అనుకుంటే రాష్ట్ర నాయకత్వంలో సతీష్ అనే వ్యక్తి మాటలు నమ్మి నన్ను వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి పార్టీ నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని,  ఆ వ్యక్తి (సతీష్) వ్యక్తిగతంగా నా నుండి డబ్బులు డిమాండ్ చేసి ఆన్లైన్ ద్వారా రూ. 5,00,000 వేయించుకున్నాడని ఆరోపించారు. నగదు రూపంలో ఇంకొక రూ. 6,00,000 లకు పైగా తీసుకున్నాడని, ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ వ్యక్తి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. సతీష్ వలన రాష్ట్రంలోని వైఎస్ఆర్ టిపి పార్టీ బ్రష్టుపట్టిపోయిందని ఆరోపించారు. ఇది ప్రారంభము మాత్రమేనని రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామాచేసే పరిస్థితి ఉందన్నారు. అందుకే ఈ రోజున నేను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శులు సగడాల లచ్చిరెడ్డి, పెద్దబోయిన శ్రీనివాసరావు, ఆలశ్యం రవి, జిల్లా ఎస్.టి. సెల్ అధ్యక్షులు ఇస్లావత్ రాంబాబు నాయక్, మహిళా అధికార ప్రతినిధి సింగరం యాక లక్ష్మి, శీలం వెంకటరమణ (జిల్లా మహిళా ప్రధానకార్యదర్శి), బదావత్ సైదులు నాయక్, వైరా నియోజకవర్గ నాయకులు, బి.సి. సెల్ అధ్యక్షులు చింతల వాసు, ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె. మస్తాన్ పాషా, పివియం ప్రసాద్, వైరా మండల అధ్యక్షులు తాళ్లూరి రాంబాబు, కారేపల్లి మండల అధ్యక్షులు, జిల్లా ఎస్సి. సెల్ ఉపాధ్యక్షులు గోరంట్ల రమేష్ బాబు, పాలేరు నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ ఎస్ కె. మదార్ సాహెబ్ , జిల్లా ఎస్.టి. సెల్ ప్రధాన కార్యదర్శి బాణోత్ వీరునాయక్ తదితరులు నాతో కలిసి పార్టీకి రాజీనామా చేసారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: నా బిడ్డ ఏం అన్యాయం చేసింది : విజయమ్మ