Telugu News

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి

% నివాళ్లు అర్పించిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల

0

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి
%% నివాళ్లు అర్పించిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
భారతదేశ 2వ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ. జావిద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరారవు హాజరై చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పువ్వాళ్ళదుర్గాప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ భారదేశ 2వ మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి 1926వ సంవత్సరంలో కాశీ విద్యాపీఠం నుండి ప్రథమశ్రేణిలో పట్టబద్రులైనారని, కాశీ విద్యాపీఠం ఇచ్చే పట్టాను ఆ రోజులలో “శాస్త్రి” అనే పదంతో గౌరవంగా సంబోధించేవారని అన్నారు. ఆ విధంగా శాస్త్రి అనేది ఆయన పేరులో ఒక భాగమైపోయినదని, శాస్త్రి మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రభావితులై 1921లో భారతస్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. ఆ సమయంలోనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారని తెలిపారు. స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడిన ఆయన రవాణాశాఖామంత్రిగా, రవాణా వ్యవస్థలో మొట్టమొదటిసారిగా మహిళ కండక్టర్లను నియమించారని తెలిపారు. పోలీస్ శాఖలో అనేక విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చిన శాస్త్రి 1952లో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికై, 1956 వరకు కేంద్రరైల్వే, రవాణాశాఖామంత్రిగా పనిచేశారని తెలిపారు.

also read :-దేవుడి కాళ్ళవద్ద మనిషి తల

1956లో సెప్టెంబర్ నెల మహబూబ్ నగర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ఆదర్శవ్యక్తి ఆయనని కొనియాడారు. 1964 జూన్ 9వ తేదీన ప్రధానమంత్రి పదవిని చేపట్టారని, జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తి పెంచే దిశగా శ్వేతవిప్లవాన్ని ప్రోత్సహించారని, 1965లో జరిగిన 22 రోజుల భారత్-పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి మరోఘనత సాధించారని తెలిపారు. ఆదర్శనేత, ఆ మహానేత వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరూ వారి బాటలో పయనించడమే మనం వారికి ఇచ్చే ఘననివాళులు అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎంఎల్సీగా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్.సి. సెల్ కన్వీనర్ దర్జి చెన్నారావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ గారు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కాశేఖర్ గౌడ్ , జిల్లా ఓ.బి.సి. సెల్ ఉపాధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న,జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్ , మద్ది వీరారెడ్డిగారు, మూడుముంతల గంగరాజు యాదవ్ , చోటా బాబుగారు, ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకటయ్య, తూములూరి లక్ష్మీనరసింహారావు, బండి నాగేశ్వరరావు, గౌస్ , గాంబాబు, ఎస్.కె. రజీ, బాణాల లక్ష్మణ్ , రాందాస్ నాయక్ , బీరెడ్డి రమేష్, కె. శ్రీనివాసులు, బి. నాగరాజు, అంజి, వై. నాగరాజు, గజ్జి సూర్యనారాయణగ తదితర నాయకులు పాల్గొన్నారు.