Telugu News

రామోజీ ఫిల్మ్ సిటిలో లారెన్స్ న్యూ సినిమా సందడి

ఓ సినిమా సీక్వెల్ షూటింగ్ లో బిజిబిజీ

0

రామోజీ ఫిల్మ్ సిటిలో లారెన్స్ న్యూ సినిమా సందడి

== ఓ సినిమా సీక్వెల్ షూటింగ్ లో బిజిబిజీ

(సినిమా-విజయంన్యూస్)

ప్రముఖ డ్యాన్సర్.. సిని హీరో..డైరెక్టర్ లారెన్స్ ఓ కొత్త సినిమా బిజిలో నిమగ్నమైయ్యారు.. ఓ కొత్తరకమైన సినిమాల వైపు వెళ్తున్న లారెన్స్ ఇటీవలే మరో సినిమా షూటింగ్ పనిలో పడ్డారు. భారతదేశవ్యాప్తంగా అద్భుతమైన సూపర్ హిట్ గా నిలిచిన సూపర్ స్టార్ సినిమా ‘చంద్రముఖి’ సినిమాకు సిక్వెల్ గా ‘చంద్రముఖి-2’ తెరకెక్కిస్తున్నారు. చంద్రముఖి సినిమాలో రజినికాంత్ నటించగా, చంద్రముఖి-2 సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి.వాసు ఈ సినిమా కు కూడా డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. లైకా ప్రొడెక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. సుమారు నెల రోజుల పాటు ఈ షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లారెన్స్ రాథిక, వడివేలు తదితర సినియాక్టర్లపై ఓ ఇల్లు నేపథ్యం సాగే సన్నివేశాలను చిత్రికరిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రముఖి అద్భుతవిజయం సాధించడంతో చంద్రముఖి-2పై భారీగా అంచనాలు పెరిగాయి..

ఇది కూడా చదవంఢి : నేటి నుంచి ప్రపంచకప్ టీ20 క్రికెట్ ఆరంభం