Telugu News

చంద్రబాబు అర్థరాత్రి అరెస్ట్ తప్పిదమే: తుమ్మల

రాజకీయ కక్షలో భాగమే అంటూ తప్పు పట్టిన మాజీ మంత్రి

0

చంద్రబాబు అర్థరాత్రి అరెస్ట్ తప్పిదమే: తుమ్మల

== రాజకీయ కక్షలో భాగమే అంటూ తప్పు పట్టిన మాజీ మంత్రి

(ఖమ్మం -విజయం న్యూస్)

చంద్రబాబు నాయుడు అర్థరాత్రి అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తప్పుపట్టారు శనివారం ఆంధ్ర పదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడ్ని అర్థరాత్రి  అరెస్టు.. జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పందించారు.

ఇది కూడా చదవండి:- ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్

రాజ్యాంగ హక్కులను కాలారాస్తూ రాజకీయ కక్ష్య తో చంద్రబాబు పట్ల వ్యవహారించిన తీరు దుర్మార్గమని అన్నారు.

పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు పై అసత్యాలతో కట్టుకథలతో ఆయన ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. కనీస న్యాయ సూత్రాలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని, నిజనిజాలు త్వరలో తెలుస్తాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- చంద్రబాబు కు బెయిలా..?  జైలా..?