ఖమ్మంలో న్యాయవాద దంపతుల పై దాడి
== తీవ్రంగా ఖండిరచిన బార్ అసొసియేషన్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది మోజెస్ క్రిస్టఫర్, మరియు అతని భార్య పై కొందరు వ్యక్తులు విచక్షనా రహితంగా దాడికి పాల్పడ్డారు. గత నెల 24 క్రిష్టఫర్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఉన్న సమస్యల పై చర్చించేందుకు సమావేశమయ్యారు. పై ప్లాట్‌లో ఉంటున్న వారి నీళ్లు కిందకు జారుతున్నాయనే ఫిర్యాదు పరిష్కారం కొరకు సమావేశం అయ్యారు. కాగా అదే అపార్ట్‌మెంట్‌లో కిరాయికి ఉంటున్న వారు బయట వ్యక్తులను సమావేశానికి పిలిపించి, కుర్చీలో కూర్చొని సమాధానం చెబుతున్న క్రిష్టఫర్ పైన మొదట విచక్షణా రహితంగా, సున్నిత అవయవాల పై దాడి చేశారు. అడ్డు వచ్చిన ఆయన భార్యను కూడా మెడ పై నెట్టి దెబ్బలు కొట్టారు. ఈ ఘర్షణ చాలా సేపు జరిగింది.
ఇది కూడ చదవండి: పొంగులేటికి బిగ్ షాక్
అదే అపార్ట్‌మెంట్ నివాసులు అడ్డుకున్నా ఆగకుండా అరాచకం సృష్టించారు. ఈ దాడి ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్ట్ అయింది. సదరు సీసీ టీవీ ఫూటేజీ తీసుకొని క్రిష్టఫర్ దంపతులు డిసెంబర్ 24న స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిందితుల పై ఎటువంటి చర్యతీసుకోలేదంటూ బార్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయగా, బార్ అసోసియేషన్ స్పందించింది. న్యాయవాదులంతా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని క్రిష్టఫర్‌కు మద్దతుగా నిలిచారు. దాడికి పాల్పడిన వ్యక్తుల పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల సమక్షంలో సబ్ ఇన్స్‌పెక్టర్ మేడా ప్రసాద్ ఫిర్యాదును స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 294బి, 307, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశారు.
== దాడి హేయం: ముక్త కంఠంతో ఖండిరచిన న్యాయవాదులు
ఒక వైపు న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తుంటే మరోవైపు న్యాయవాదల పై దాడులు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్‌ను ఫిర్యాదు చేయగానే స్పందించిన న్యాయవాదులు సంఘటితంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కేసు నమోదు చేయించే వరకు న్యాయవాద దంపతులకు మద్దతుగా నిలిచారు. పాల్గొన్నవారిలో అడ్వకేట్లు మేకల సుగుణారావు, స్వర్ణకుమారి, ఆనంద్, మర్రి ప్రకాష్, చార్లెస్ వినయ్, అయితగాని జనార్ధన్, స్వప్న, కన్నాంబ, ఎక్కిరాల రాంబాబు, తాళ్లూరి దిలీప్, పవన్, వెంకట నారాయణ, గుప్తా, వరుణ్, ఎన్ వెంకటా చారి, విజయశాంతిలతో బాటు పలువురు న్యాయవాదులు సంఘటితంగా నిలిచారు.
ఇది కూడా చదవండి: కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు