‘ఖమ్మం’ పై నేతల పోకస్
== ప్రాంతీయ, జాతీయ పార్టీల కుర్చీలాట
== ఎవరి సత్తా ఏంటో చూపించుకునేందుకు ప్రయత్నాలు
== టీడీపీ, సీపీఎం పార్టీల బహిరంగ సభలు సక్సెస్
== ఈనెల 18 బీఆర్ఎస్ బహిరంగ సభ
== 26న భద్రాచలంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
== పిబ్రవరిలో బీజేపీ బహిరంగ సభ
== ఎన్నికల ఫీవర్ గా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లా
(శివనాగిరెడ్డి, చండ్రుగొండ-విజయంన్యూస్)
ఒకప్పుడు కమ్యూనిస్టు ఖీల్లా.. వామపక్ష పార్టీలు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నేల.. నక్సలైట్ పార్టీల హవా గా పేరు పొందిన జిల్లా.. జిల్లా కేంద్రం నుంచి సుమారు 250 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అతి పెద్ద జిల్లా.. రానురాను ఆ పార్టీలు కనుమరుగై, ప్రాంతీయ పార్టీలకు గట్టి పునాది ఏర్పడిన జిల్లా.. ఈ ఖమ్మం జిల్లా.. తొలి,మలి దశ ఉద్యమాలకు ఊపిరి పోసిన చరిత్రలో లిఖిత మైన జిల్లా ఈ ఖమ్మం జిల్లా. అంతే కాదు..రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా.. తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరు గాంచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఎందరో మహానుభావులను చట్టసభలకు పంపించిన జిల్లా ఇది. జనాల నాడి పట్టిన నేతలేందరో ఉన్నారు.. అలాంటి వారిని కాదని జాతీయ, రాష్ట్రీయ రాజకీయాలకు నిలయంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లా.. అలాంటి జిల్లాపై ప్రధాన పార్టీలు ఒకేసారి ఫోకస్ పెట్టాయి. అందుకే ఈ జిల్లాపై రాజకీయ చదరంగం మొదలైంది..
== జాతీయం ను తలదన్ని ప్రాంతీయం వైపు
ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ పార్టీలకు నిలయంగా ఉండేది. కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టుల పోరుబాటలకు కేంద్రంగా ఉన్న ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా కాలం పాటు కాంగ్రెష్, కమ్యూనిస్టులు శాంచించారు. అలాంటి ఉమ్మడి జిల్లా క్రమేమిపీ ప్రాంతీయ పార్టీలకు నిలయంగా మారింది.. కమ్యూనిస్టుల ప్రాభల్యం తగ్గిపోయి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వచ్చింది.. దీంతో కాంగ్రెస్ వర్సస్ టీడీపీగా మారింది.. ఆ తరువాత టీడీపీ ప్రాబల్యం తగ్గి వైసీపీ పార్టీ తెరపైకి వచ్చింది.. ఒక ఎంపీ స్థానం, మూడు ఎమ్మెల్యేలు గెలుచుకునే స్థాయికి చేరింది. అంతలోనే మరో ఎన్నికలు వచ్చే నాటికి వైసీపీ పతనమై టీడీపీ పార్టీ పుంజుకుంది..
ఇది కూడా చదండి : –పొంగులేటికి ఊహించని షాక్..?
అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉంది. ఇతర పార్టీల నుంచి నేతలను లాగేసుకున్న ఆ పార్టీ స్థానిక ఎన్నికల నాటికి బలమైన పార్టీగా మారింది.. అంటే జాతీయ పార్టీలను తలదన్ని ప్రాంతీయ పార్టీలకు పట్టం గట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లా..? ఈ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కమ్యూనిస్ట్‌ల ప్రభావం ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో లెఫ్ట్ కూటమితో జత కట్టి జిల్లాలో టీడీపీ బలంగా కనిపించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. 2014లో జిల్లాలో టీఆర్‌ఎస్‌కు దక్కింది ఒకే ఒక సీటు. 2018లోనూ అదే పరిస్థితి. రాజకీయ కారణాలతో వివిధ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కేసినా.. ఎన్నికల ముఖచిత్రం చెప్పే లెక్కలు వేరు. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని టీఆర్‌ఎస్ పావులు కదుపుతుంటే.. పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్ చూస్తోంది. ఈ రెండు పార్టీల వార్ ఇలా ఉంటే.. కొత్తగా బీజేపీతోపాటు షర్మిల పార్టీ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే కన్నేశాయి. గత కొన్ని నెలల క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు సైతం.. జిల్లాలో టీడీపీ పుంజుకునేందుకు సానుకూల వాతావరణం ఉందని ప్రకటించారు. అందుకే ప్రధాన పార్టీ ఎత్తుగడలు మిషన్ ఖమ్మం రాజకీయాలను ఆసక్తిగా మలుస్తున్నాయి…
== ఖమ్మం జిల్లాపై నజర్ పెట్టిన సీఎం కేసీఆర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్ఎస్ పార్టీ అంతగా సక్సస్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన ఫలితాలు వస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక రకమైన ఫలితాలు వచ్చాయి. రెండు సార్లు ఎన్నికలు జరిగి, టీఆర్ఎస్ కు భారీగా స్థానాలు వచ్చినప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్కటే విజయం సాధించాయి. 2014 లో పది స్థానాలకు ఒక జలగం వెంకట్రావు విజయం సాధించగా, 2018 ఎన్నికల్లో పది స్థానాలకు పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే విజయం సాధించారు. దీంతో సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఖమ్మం జిల్లాలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కమలం వైపు ’మడత‘ చూపు
అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో అభివద్దిపై కన్నేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీగా నిధులు మంజూరు చేశారు. అయితే ఇటీవలే జాతీయ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాపై నజర్ ప్రకటించారు. అందులో భాగంగానే ఈనెల 18న బారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవిర్భవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస ఎెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాపై సీఎం కేీసఆర్ పోకస్ పెట్టారు.
== నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్..?
కాంగ్రెస్ పార్టీ జిల్లాలో అతిపెద్ద పార్టీ.. ఎంతో మంది అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన పార్టీ. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిని అందించిన పార్టీ. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేసిన పార్టీ. కేంద్రమంత్రులను, రాష్ట్రంలో కీలక మంత్రులను అందించిన పార్టీ. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, రేణుక చౌదరి కేంద్రమంత్రిగా, శీలం సిద్దారెడ్డి, జలగం ప్రసాద్ రావు, వనమా వెంకటేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్లను మంత్రులుగా పనిచేయించిన పార్టీ.. ఇప్పుడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతుంది.
ఇది కూడా చదవండి: ‘పాలేరు’ రేసులో ‘ఆ ఇద్దరు’
ఇప్పటి వరకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. రేణుక చౌదరి అమవాస్య, పౌర్ణమి అన్నచందంగా ఆరునెలలకు, మూడు నెలలకోకసారి అతిథిలా వచ్చి వెళ్తున్నారు.. సంభాని చంద్రశేఖర్ తన ప్రాభల్యం తగ్గిపోయింది.. తన సీటు తాను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.. రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఆ కుటుంబం జిల్లాలో కనుమరుగైయ్యారు. ఇక మిగిలింది భట్టి విక్రమార్క ఒక్కరే. ఆయన పై కొన్ని విమర్శలు ఉన్నాయి.. స్థానికంగా నాయకత్వం కొంత మంది విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతున్న పరిస్థితి ఏర్పడింది.. వారిని కాపాడేవారే కరువైయ్యారు. దీంతో . రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాల్లో ఆధిపత్య పోరు కారణంగా రాను రాను పార్టీ బలహీన పడుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
== బల నిరూపణలో టీడీపీ
ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు దడదడలాడించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు కనుమరుగైంది.. గత ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికి వారు టీఆర్ఎస్ గూటిలో చేరిపోవడంతో తండ్రిలేని కుటుంబంగా మారింది.టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు జిల్లాలో ఉద్దండులైన నాయకులు ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న కొందరు గతంలో ఇదే జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన వాళ్లే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో గెలిచిన రెండే రెండు సీట్లు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. అశ్వారావుపేట.. సత్తుపల్లిలో టీడీపీ పాగా వేసినా.. తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలు సండ్ర వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు అభివృద్ధి పేరిట గులాబీ గూటికి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?
ఏపీ రాజకీయాలపై చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో తెలంగాణలో సైకిల్ చతికిల పడింది. ఆ ప్రభావం ఖమ్మంజిల్లాలోనూ కనిపించింది. తాజాగా గత కొంతకాలం క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. అక్కడ జనాల స్పందన చూశాక కొత్త లెక్కలు వేసుకున్నారు . ఖమ్మం జిల్లా నుండి రాష్ట్రం మొత్తం ఈ జిల్లా నుండి కార్యాచరణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. టీడీపీ పుంజుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, అంతటితో ఆగకుండా, ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ పార్టీ అధినాయకత్వానికి సూచించారు. అనుకున్న విధంగానే గత నెల 21న ఖమ్మంలో భారీ బహిరంగ నిర్వహించి టిడిపి పార్టీ శ్రేణులకు దశ దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని స్థానంలో పోటీ చేస్తుందని ఖమ్మం బహిరంగ సభలో తెలియజేశారు. అయితే ఫ్రస్తుతం టీడీపీ పార్టీ అధినేత మరోసారి ఉమ్మడి ఖమ్మంపై నజర్ పెట్టారు. తన ప్రాంత ప్రాభల్యంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా, ఆ సభ సూపర్ సక్సెస్ అయ్యింది.. దీంతో టీడీపీ మళ్లి పుంజుకునే అవకాశం లేకపోలేదు.
== అసంతృప్తి నేతలపై ఫోకస్ పెట్టిన బిజెపి…
ఇక జిల్లా బీజేపీ నేతలు సైతం జిల్లాలో బలం పెంచుకోవాలని చూస్తున్నారు. సంస్థగతంగా జిల్లాలో పెద్దగా క్యాడర్ లేని పార్టీగా, బలమైన నాయకత్వం లేకపోవడంతో జిల్లాలో బిజెపి ప్రభావం చాలా తక్కువ. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలకు వల వేయాలని అనేక ప్రయత్నాలు బీజేపీ నేతలు చేస్తున్నారు. అలా మాజీ ఎంపీ పొంగులేటికి, తుమ్మల నాగేశ్వరావు గాలం వేశారని ప్రచారం జరుగుతుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరేందురు రంగం సిద్దమైంది. అంతే కాకుండా వచ్చే నెలలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వేలాధి మంది సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, ప్రస్తుత చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇలా ముఖ్యమైన నాయకత్వం మొత్తం ఆ రోజు పార్టీలో చేరే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖమ్మం నుంచే ప్రారంభించాలని భావిస్తున్న బీజేపీ పార్టీ అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఏది ఏమి జరిగినా జిల్లాలో నానాటికి రాజకీయ సమీకరణాలు రోజుల విధంగా మారుతున్నాయి. రాష్ట్రస్థాయి బిజెపి నేతలు సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారని జిల్లాస్థాయి నాయకులు చర్చించుకోవడం గమహర్హం. ఏది ఏమి జరిగినా ఖమ్మం జిల్లాలో ఎవరి మిషన్ పని చేస్తుందో మరి కొద్ది నెలల్లో తెలుస్తుంది.
== పాలేరు నా అడ్డా అంటున్న షర్మిల…
రాజకీయంగా నిలుదొక్కుకోవాలని చూస్తున్న వైఎస్ షర్మిల సైతం వైఎస్‌ఆర్‌టీపీని ఖమ్మంలోనే ప్రారంభించారు. జిల్లాలో విస్తృతంగా పాదయాత్ర చేసిన షర్మిల.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు. పాలేరులో పోటీ చేస్తే ఆ ప్రభావం మరికొన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని.. పార్టీకి తొలి ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని షర్మిల అండ్ కో ఆలోచన. 2014లో వైసీపీకి ఇదే జిల్లాలో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఆ కోణంలోనూ జిల్లాపై ఆశలు పెట్టుకున్నారు షర్మిల.