Telugu News

కాపులను కమ్మేస్తున్న నేతలు…

** ప్రత్యామ్నాయం వైపు కాపు నేతల చూపు...   

0

కాపులను కమ్మేస్తున్న నేతలు…
** ప్రత్యామ్నాయం వైపు కాపు నేతల చూపు…   

** తాజా మాజీ ఎమ్మెల్యేల పోరులో నలుగుతున్న కాపులు..
** రాజకీయ ఉనికి కోసం కాపు నేతల పాట్లు…
** వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సత్తా చాటేందుకు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును… 

(మణుగూరు, విజయం న్యూస్)

పినపాక నియోజకవర్గం లో బీసీ సామాజిక వర్గ లలో  అత్యధిక ఓటు బ్యాంకు కలిగి ఉన్న కాపు సామాజికవర్గం చూపు రానున్న ఎన్నికల్లోఎటువైపు …? అనే ప్రశ్న నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.నియోజక వర్గంలో ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా బలమైన కాపు సామాజికవర్గం ఎవరికి మద్దతు పలకనుందో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. రానున్న శాసన సభ ఎన్నికలలో కాపులు ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించి మరే అభ్యర్థికి తగిన గుణ పాఠం చెప్పనున్నారో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ అంశాలపై విజయం పత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం…. పూర్వ భూర్గంపహడ్ నియోజకవర్గంతో తాజా పినపాక నియోజకవర్గం లో ఆధినుండి కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ కి జేజేలు పలికి కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచారు.

also read :-గోల్ఫ్ టోర్నీలో రజత పతకం సాధించిన గురుకుల విద్యార్థినిని అభినందించిన సైబరాబాద్ సీపీ……

అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించారు. స్వరాష్ట్రం కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో సైతం ఆంధ్ర నాయకుల పెత్తనానికి వెరువక ఉద్యమాన్ని భుజ స్కందలపై మోసి కీలక భాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాజా పినపాక మాజీ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించి ఆయనకు అనుకూలంగా పనిచేశారు. అదే ఇప్పుడు ఆ సామాజిక వర్గం పాలిట శాపంగా మారింద..? అనే ప్రశ్న నియోజకవర్గం లో చర్చనీయాంశంగా   మారింది. కాపు సామాజిక వర్గం పట్ల ప్రస్తుత ఎమ్మేల్యే విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రయోగిస్తున్నారని సంఘం నేతలు అభిప్రాయ పడుతున్నారు. పినపాక నియోజకవర్గం లో  నాలుగు మండలాల్లో  ప్రధాన ఓట్ బ్యాంక్ కలిగిన సామాజిక వర్గం కు అధికార టిఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం పార్టీ పదవుల్లో సరైన ప్రాధాన్యం దక్కలేదని వాదన ఆ సంఘం నేతలు నుండి బలంగా వినిపిస్తోంది.

మణుగూరు మండలంలో గతంలో రాజకీయాలను శాసించి పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ఉద్యమంలో సైతం కీలక పాత్ర పోషించిన కాపు నాయకులకు టిఆర్ఎస్ పార్టీలో పదవులు అందని ద్రాక్షగానే మిగిలిపోయయనే వాదన కాపు నేతల్లో వినిపిస్తోంది. గత ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే వెంట నడిచిన కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు యువ నేతలను పక్కన పేట్టి అవకాశ వాద నాయకులకు పదవులను కట్టబెట్టి తమను రాజకీయంగా చిన్నచూపు చూస్తున్నారనే చర్చ కాపు సామాజిక వర్గం లో బలంగా సాగుతోంది. సింగరేణి ప్రాంతంలో కార్మిక ఉద్యోగులు ఉన్న సామాజిక వర్గం ఐక్య కాపు వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కాపు సంఘం ఉన్న యూనియన్ కార్యక్రమాల్లో సరైన ప్రాధాన్యత లేకపోవడం కూడా ఆ వర్గం లో కొంత నిరాశకు గురవుతుంది.

మరోవైపు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో బలమైన కాపు నేతగా గుర్తింపు పొందిన మాజీమంత్రి కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు కు పినపాక శాసనసభ్యులు మధ్య నెలకోన్న వర్గ విభేదాల కారణంగానే వీరికి పదవులు గుర్తింపు ప్రాధాన్యం దక్కక పోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆది నుండి వనమా వెంకటేశ్వరరావు తో కాపులకు ఉన్న సఖ్యత కారణంగానే పిన పాక నియోజకవర్గంలో కాపు నేతలను పక్కకు పెట్టి నియోజకవర్గంలో కాపు నేతలకు అధికార పార్టీలో ప్రాధాన్యత గుర్తింపు కల్పించకుండా దూరం పెట్టారని కాపులు అంతర్మధనం చెందుతున్నారు. జిల్లాలో కాపులకు పెద్దదిక్కుగా ఉన్న ఆ నేతను వదులుకోలేక సరైన గుర్తింపు ఇవ్వని ప్రస్తుత రాజకీయాలలో నిశబ్దంగా ఉండటమే మేలని వర్గానికి చెందిన రాజకీయ నాయకులు చెప్పడంతో తమలో నెలకొన్న అసంతృప్తిని బాధలను బయటకు వ్యక్తం చేయలేక నిశ్శబ్ద వాతావరణంలో కాలం గడుపుతూ కాపుల రాజకీయ స్తబ్దతకు కారణంగా కనిపిస్తోంది.

రాజకీయ ప్రాధాన్యతను కల్పించని పార్టీకి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో మరోమారు సత్తా చాటేందుకు ఇప్పట్టినుండే పక్కవ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెట్టి నియోజక వర్గంలో సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు క్యాడర్, తమకు రాజకీయంగా సరైన ప్రాధాన్యత గుర్తింపునిచ్చే నాయకునికి మద్దతు ప్రకటించి కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా నియోజక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు రాజకీయాల్ని శాసించే సత్తా కలిగిన కాపు నేతలు గుర్తింపునిచ్చే పార్టీలో ఏమేరకు ప్రాధాన్యత దక్కించుకొని ప్రభావం చూపుతారో రానున్న ఎన్నికలే సమాధానం కానున్నాయి.