Telugu News

తెలంగాణాలో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీక్

తెలంగాణ విజయం న్యూస్

0

తెలంగాణాలో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీక్

(తెలంగాణ విజయం న్యూస్);-

తెలంగాణలో జరుగుతున్న పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. ఈ మేరకు బోర్డు సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.అయితే ప్రశ్నా పత్రాలను లీకవుతుండటాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read :-**వనమా రాఘవాకు హైకోర్టులో చుక్కెదురు బెయిల్ మంజూరు చేయని హైకోర్టు

వాట్సాప్ ద్వారా దీనిపై విచారించగా బాట సింగారం లోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నాపత్రాలు లీకవుతున్నట్లు గుర్తించారు. విద్యార్థులకు ఈ కళాశాల నుంచి వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రాలను పంపుతున్నట్లు విచారణ లో తేలింది. దీంతో పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.