Telugu News

జర్నలిజం ముసుగులోని అసాంఘీక శక్తులపై తరిమెద్దాం : ఐజేయు

టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహాత్ అలీ

0

జర్నలిజం ముసుగులోని అసాంఘీక శక్తులపై తరిమెద్దాం : ఐజేయు

== పవిత్రమైన జర్నలిజాన్ని కాపాడుకుందాం

== జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న ఆందోళనలు

== అధికారంతో అంటగాకే యూనియన్లకు మనుగడ లేదు

== టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహాత్ అలీ

ఖమ్మం,సెప్టెంబర్ 15(విజయంన్యూస్)

పవిత్రమైన జర్నలిజం ముసుగులో పాత్రికేయ వ్రతి గౌరవాన్ని భంగం కలిగించే అసాంఘీక శక్తులకు తగిన గుణపాఠం చెప్పేందుకు మరో ఉద్యమం చేప్పటాల్సిన  తరుణం అసన్నమైందని టియుడబ్ల్యు జె (ఐజెయు)రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి కె విరాహాత్ అలీ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన టి యు డబ్ల్యు జె ఐజెయు జిల్లా కార్యవర్గ  సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ   ఒక నాడు పోలీసులు అంటే భయపడే వారని ,ఇప్పుడు జర్నలిస్టుల అంటే భయపడే రోజులు వచ్చాయన్నారు.దీనికి ప్రధాన కారణం కొంతమంది అసాంఘీక శక్తులు మీడియా ముసుగు లో చేస్తున్న అరాచకాలు వ్రతినే నమ్ముకున్న నిజమైన జర్నలిస్టులకు అపవాదు వచ్చేవిధంగా తయారైందన్నారు.

ఇది కూడా చదవండి: రేపే తుమ్మల జాయినింగ్

రెండు రోజుల క్రితం ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో 9మంది ముఠా జర్నలిస్టుల పేరుతో ఒక రైస్ మిల్లు యజమానిని బెదిరింపులకు గురిచేసిన సంఘటన జర్నలిస్టు వ్రతికే కళంకంగా మారిందన్నారు.ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి అసాంఘీక శక్తులను నిరోదించకపోతే సమాజంలో జర్నలిజం వ్రతి మరింత భ్రష్టు పడే ప్రమాదం ఉందన్నారు.గతంలో ఒక ఊరు నుంచి జర్నలిస్ట్ పుట్టితే ఆ ఊరికి ఎంతో మెలు జరుగుతుందని ప్రజలంతా భావించే వారు కాని ఇప్పుడు జర్నలిస్టు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.హైద్రాబాద్ లో గాని జిల్లా కేంద్రాల్లో గాని విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే నిర్వహకులు భయపడే పరిస్థితి నేడు దాపురించిందన్నారు.నిజమైన మీడియాను బ్రతికించేందుకు మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.కేవలం జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసమే కాదు  మీడియా రంగాన్ని దెబ్బతే వాళ్ళపై కూడా ఉద్యమించకతప్పదన్నారు. పవిత్రమైన పాత్రికేయు వ్రతిని ఆగౌరవ పర్చే శక్తుల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అనేక కార్యక్రమాలను తీసుకరావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

== అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ఆందోళనలు

జర్నలిస్టుల హక్కులు,సమస్యలపై అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చందని ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని విరాహాత్ అలీ పిలుపు నిచ్చారు పాత్రికేయులకు న్యాయస్దానం అయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఎత్తివేసేందుకు, వర్కింగ్ జర్నలిస్ట్  చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పాట్నాలో జరిగిన  జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలనే ఉద్దేశ్యంతో రానున్న అక్టోబర్ 14న జాతీయ స్దాయిలో మహిళ సదస్సును ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇది కూడా చదవండి: తుమ్మల ఇంటికి ఠాక్రే

రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు పంపిణీ చేయాలని,హెల్త్ కార్డులు అన్ని కార్పోరేట్ ఆసుపత్రులో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఇటివల రాష్ట్ర కమిటి ఇచ్చిన పోస్టు కార్డు ఉద్యమానికి మంచి స్పందన లభించిందని సుమారు పదివేల పోస్టుకార్డులు ప్రగతి భవనం కు చేరాయన్నారు.త్వరలో మారోరూపంలో ఉద్యమకార్యచరణకు పిలుపు నివ్వడం జరుగుతుందన్నారు.ఇళ్ళ స్ధలాల విషయంలో స్దానిక ఎమ్మెల్యేలపై వత్తిడి పెంచాలని, వారి చొరవ వల్లనే సాధ్యం అవుతుందన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 2600మంది జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు,డబుల్ బెడ్ రూం ఇళ్ళు దక్కాయన్నారు.2018 వరకు జర్నలిస్ట్ హెల్త్ కార్డులు అద్బుతంగా పనిచేశాయని,ఆ తరువాత నుంచి కార్పోరేట్ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని అయితే త్వరలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు మెరుగైన నూతన హెల్త్ కార్డు విధానంను తీసుకరాబోతున్నారని ఈవిషయాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తమ యూనియన్ ప్రతినిధి బ్రంధానికి హామి ఇచ్చారన్నారు.ఎన్నికల నోటిఫికేషన్ ముందే  ఈ కొత్త స్కింను ప్రకటించే అవకాశం ఉందన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు హైల్త్ స్క్రినింగ్ క్యాంపులు ప్రభుత్వం నిర్వహించబోతుందన్నారు.అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ విద్యా సంస్ధలో  ఫీజు రాయితీ కోసం డి ఇ వోలతో సర్కులర్ ను జారీ చేయించడం కంటే ప్రభుత్వం నుంచి జి వో జారీ చేయించేందుకు ప్రభుత్వం పై వత్తిడి పెంచుతామన్నారు.

== అధికారంతో అంటగాకే యూనియన్లకు మనుగడ లేదు

అధికారంతో అంటకాగే ఏ ట్రేడ్ యూనియన్ అయినా,ఉద్యోగ సంఘాలు అయినా మనగడ సాగించలేవని ఆయన విరహాత్ అలీ అన్నారు.భజన సంఘాలు పదవుల కోసం ప్రాకులాడుతాయే తప్పా జర్నలిస్టుల హక్కుల కోసం కోట్లాడలేవన్నారు.60ఏళ్ళ చరిత్రలో తమ యూనియన్ కు పోరాటాలు,ఉద్యమాలు,త్యాగాల చరిత్ర ఉందే తప్ప ఏనాడూ కూడా ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండలేదు,పదవులకోసం ప్రాదయేపడలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొంతమంది దుర్బిదితో కొత్త దుకాణాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ పదవులకోసం సాకిలా పడ్డారన్నారు.జర్నలిస్ట్ వ్రతిని నమ్ముకొని,సామాజీక స్ప్రహ కలిగిన 13వేల మంది సభ్యులు కలిగిన నిరంతరం పోరాటపటిమ కలిగిన టియుడబ్ల్యుజె గతంలో చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఎన్నో సంక్షేమపధకాలను సాధించుకున్నామన్నారు.భారత దేశంలోనే అత్యధిక స్దాయిలో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా మన యూనియన్ కు గుర్తింపు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 50వేల మంది కి అక్రడేషన్లు ఉంటే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 50వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లను సాధించన ఘనత కూడా తమ సంఘానికే దక్కుతుందన్నారు.30 ఏళ్ళ క్రితం పత్రికయజమానులు తమ పత్రికలో పనిచేసే విలేఖర్లను పాలేర్లకంటే హినంగా చూసే రోజుల్లో  కనీసం పత్రిక నుంచి గుర్తింపు కార్డును జారీ చేయడానికి కూడా ఇస్టపడని రోజుల్లో  గ్రామీణ విలేఖర్లను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలని అనాడు ఉద్యమించిన ఫలితంగానే 1996లో సూర్యాపేటలో జరిగిన రాష్ట్ర మహాసభలో అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ విలేఖర్లకు అక్రిడేషన్లు ఇవ్వడానికి అంగికరించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు  పై రాజకీయ వేధింపు కేసులు సరికాదు : ఎమ్మెల్యే కందాళ

గ్రామీణ విలేఖర్ల కోసం ఉద్యోగ భద్రత కోసం పోట్లాడి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని తీసుకొచ్చిన చరిత్ర కూడా తమ యూనియన్ కే ఉందన్నారు. లేబర్ కోర్టు ద్వారా ఎంతో మంది మండల విలేఖర్లకు పత్రికయజమాన్యం ద్వారా నష్టపరిహారం ఇప్పించిన ఘనత తమదేనన్నారు.జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర రాజధానిలో ఐదువేల మంది జర్నలిస్టుతో గర్చించడంతో పాటు గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని విస్తరించి జంతర్ మంతర్ వద్ద భారీ వర్షంలో కూడా ధర్నా చేసి అనాటి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై మొరపెట్టుకోవడం జరిగిందన్నారు.భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం ,కనీస మౌళిక సదుపాయాలను కల్పించేందుకు  నిరంతరం పోరాటాలు చేస్తుంటామని విరహాత్ అలీ ప్రకటించారు.

==  హక్కుల కోసం పోరాడిందే ఐజేయునే : రాంనారాయణ

రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనారాయణ మాట్లాడ్తూ జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడి ఎన్నో విజయాలు సాధించిన  టియుడబ్యుజె ఇళ్ళ స్ధలాల కోసం అదే పటిమతో ముందుకు వెళ్తుందన్నారు సమాజసేవలో నిమగ్నం అయిన జర్నలిస్టుల్లో అత్యధికులు నిరుపేద కుటుంబాల నుంచే విచ్చిన వారేనని వారికి తాము గొంతమ్మ కోర్కేలు కోరకుండా ఉండటానికి గూడును మాత్రమే కోరుకుంటున్నాయన్నారు.చాలా జిల్లాలో స్దానిక ఎమ్మెల్యేలు,మంత్రులు ప్రత్యేక చోరవ తీసుకొని ఇళ్ళ స్ధలాలు ఇప్పించారని, ఈ జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కోరారు. స్ధానిక జర్నలిస్టులు కూడా స్ధానిక ఎమ్మెల్యేలపై వత్తిడి తీసుకరావాలని కోరారు.  ఇప్పటికి మనం అందుకున్న ఫలాలు తమ యూనియన్ ఆధ్వర్యంలో సాధించికున్నవేనని ఆయన అన్నారు.

== టి జి ఎఫ్ నుంచి ఐజేయులో భారీ చేరికలు

టిజెఫ్,ఇతర జర్నలిస్ట్ సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న ఐజెయులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ సమక్షంలో చేరారు.ఇప్పటి వరకు టిజెప్ లో   కీలకంగా పనిచేసి వారంతా ఖదీర్,దువ్వా సాగర్,కె.వి,పెండ్ర ఆంజయ్య,యాకేశ్ ,సంతోష్, నాగేందర్ రెడ్డి నేత్రత్వంలో వంద మంది  ఐజెయులో చేరారు.ఈ సందర్బంగా కొత్తగా చేరిన వారికి సభ్యత్వ రశీదును అందజేసి కండువ కప్పి స్వాగతించారు. కొత్తగూడెం జిల్లా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ ,సీనియర్ టిజెఎఫ్ నాయకుడు పుసులూరి రవి.టిజెఎప్ సీనియర్ నాయకుడు,ఖమ్మం ఆంద్రజ్యోతి స్టాప్ రిపోర్టర్ తాళ్ళూరి రమేశ్ పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర ప్రసాద్,పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు దానకర్ణ,కొత్తగూడెం జిల్లా అక్రిడేషన్ కమిటి మెంబర్ ,ఎలక్రానిక్ మీడియా సెక్రటరీ, సిహెచ్ నర్సింహ్మరావు, అంజాద్ ,గోపి ,టి జెఎఫ్ కెమెరామెన్ అసోసియన్ జిల్లా కార్యదర్శి ఫయాజ్,ఉపాధ్యక్షులుఅయూబ్,శరత్, వివిధ మండలాలకు చెందిన  దాదాపు 80మంది జర్నలిస్టులు ఐజెయు లో చేరారు. టియుడబ్ల్యు జె ఐజెయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు అతిధులను వేధికపైకి ఆహ్వానించగా, హెచ్ జె యు అధ్యక్షులు శంకర్ గౌడ్,జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీంధ్ర శేషు,రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావ్,మాటేటి వేణుగోపాల్,సామినేని మురారీ,ఖాదర్ బాబా,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ,జఆంధ్రజ్యోతి జిల్లా ప్రతినిధి నల్లజాల వెంకట్రావ్ ,వి6ఖధీర్,దిశ సాగర్,జిల్లా ఉపాధ్యక్షులు మైనోద్దిన్,మామిడాల భూపాల్, కోశాధికారి అయ్యప్ప,ఎబిఎన్ శ్రీధర్,కెవి,జిల్లా కోశాధికారి శివానంద,నగర కమిటి అధ్యక్షులు మైసాపాపారావు,కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్,ఇతర జిల్లా నాయకులు తాళ్ళూరి మురళీ,జనార్ధన చారీ,నామ పురుషోత్తం,సత్యనారాయణ,మేడి రమేశ్,యాకేశ్ ,సంతోష్,రామక్రష్ణ,జిల్లాకమిటి సభ్యులు యోగి,పోలంపల్లి నాగేశ్వర్ రావు,తాతా శ్రీనివాసరావు,నాగిరెడ్డి,బహుదూర్ ,నాగరాజు,సి హెచ్ రమేశ్,కెమెరా మెన్ అసోసియేషన్ అధ్యక్షులు అలస్యం అప్పారావు,ఫోటోగ్రాఫర్ అసోసియేన్ నుంచి కమటం శ్రీనివాస్,మహిళా ప్రతినిధి మధు లత తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

సత్తుపల్లి నేతల ఫైటింగ్

== ఆగని నేతల భజన నినాదం

== అతిథుల ముందే కొట్లాట

== ఖమ్మంలో కాంగ్రెస్ నేతల మీటింగ్ రసాభసా

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల్లో మార్పురాదా..? వాళ్లేవ్వరు మారరా..? పదేళ్ల పాటు ప్రభుత్వం దూరమైనా..? ప్రత్యర్థులు దూసుకపోతున్న..కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆలోచించరా..? కానీ నేతల్లో మార్పురావడం లేదు.. మీటింగ్ ఎందుకు జరుగుతుంది

 

 

 

 

 

 

 

 

 

 

స్వచ్ఛ్ సర్వేక్షన్ గ్రామీణ్ – 2023 ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయితిలకు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా స్థాయి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 2000 లోపు జనాభా (మైనర్ గ్రామా పంచాయితీ) గాను కూసుమంచి మండల, కిస్థాపురం గ్రామ పంచాయతీకు ఉత్తమ ప్రతిభ అవార్డు రావడం జరిగింది. మరియు 2000 పై జనాభా (మేజర్ గ్రామ పంచాయతీ) గాను కూసుమంచి గ్రామ పంచాయతీకు ఉత్తమ ప్రతిభ అవార్డు దక్కింది.

 

కూసుమంచి గ్రామ సర్పంచ్ శ్రీ చెన్న మోహన్ రావు గారికి, సెక్రెటరీ శంకర్ & పాలకవర్గం & పారిశుద్ధ్య సిబ్బంది కు, అలాగే కిస్థాపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి పందిరి పద్మ గారికి, సెక్రటరీ జంపాల రమేష్ & పాలకవర్గం & పారిశుద్ధ్య సిబ్బంది వాయిస్ ఆఫ్ పీపుల్ వాట్సప్ గ్రూప్ తరపున హృదయపూర్వక అభినందనలు.