కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుదాం.
— ఈనెల 12న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
– విలేకర్ల సమావేశంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.
(కూసుమంచి-విజయంన్యూస్)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రైతుల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు సాగునీటి సౌకర్యం కోసం ప్రాజెక్టులు నిర్మించి పంటల ఉత్పత్తిని రెట్టింపు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను కొనుగోలు చేయమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి యాసంగిలోనూ రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేలా ఒప్పించేందుకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని చెప్పారు. 12వ తేదీన కూసుమంచిలో జరగబోయే మహాధర్నాకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, డిసిఎంస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, జడ్పీటీసీ వరప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు, చాట్ల పరుశురాం, ఎంపిపిలు వజ్జా రమ్య, బాణోత్తు శ్రీనివాస్, బోడా మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
all so read;- కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు చేయాలని వినతి
*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’**