Telugu News

సంక్షేమాన్ని మరిచిన ఈ సర్కారును సాగనంపుదాం: పొంగులేటి 

శీనన్న భారీ మెజారిటీని ఆకాంక్షిస్తూ ముమ్మర ప్రచారం

0

సంక్షేమాన్ని మరిచిన ఈ సర్కారును సాగనంపుదాం: పొంగులేటి 

– కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి
– శీనన్న భారీ మెజారిటీని ఆకాంక్షిస్తూ ముమ్మర ప్రచారం

(ఖమ్మం రూరల్-విజయం న్యూస్):

ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అరిగోస పెడుతునన్న ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపుదామని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు.

ఇది కూడా చదవండి:-కేశ్వాపురంకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరిక

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొoగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి మిద్దె వారి గూడెం, పొలిశెట్టి గూడెo, డాక్యా తండాల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి, స్థానికులతో మాట్లాడి.. ఆరు గ్యారంటీలను వివరించారు. రోడ్లు, విద్య, వైద్య0, ఇతర మౌలిక సదుపాయాలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో అందరికీ లభిస్తాయని ధైర్యం చెప్పారు.
== మాకు ఒక్క ఇల్లు కూడా రాలేదయ్యా..*
ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదని డాఖ్యా తండాలో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:-:“చంద్రబాబు” నేడే విడుదల

పొంగులేటి ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ.. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు కట్టిద్దామని అభయమిచ్చారు. అంతటా జై కాంగ్రెస్.. జై శీనన్న నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ కె, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, మద్ధి వీరారెడ్డి, తీర్థాల మాజీ సర్పంచ్ బోడ వెంకన్న, మారెమ్మ గుడి మాజీ చైర్మన్ లింగా శ్రీనివాస్, భోజెడ్ల సతీష్, తోట నాగేశ్వరరావు, మద్ది కిషోర్, కొర్లకుంట వేణు, పెండ్లి నకేష్ తదితరులు పాల్గొన్నారు.