Telugu News

బయటకు వెళ్దాం రండీ..?

** పార్టీ మారాలని తీవ్ర ఒత్తిడి..?

0

బయటకు వెళ్దాం రండీ..?
** పార్టీ మారాలని తీవ్ర ఒత్తిడి..?
** అవమానాలను భరించలేమంటున్న నేతలు..?
** అంతర్మథనంలో ఉన్న నేత వర్గీయులు అసంతప్తి
** ఆలోచనలో పడిన ఆ నేత…?
** అతి త్వరలోనే నిర్ణయం..?
** ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తే జంపింగ్ జపాంగే..?
** ఖమ్మం రాజకీయ పరిణామాలపై పార్ట్ -2
(ఖమ్మం ప్రతినిధి- విజయంన్యూస్)
ఖమ్మం రాజకీయాల్లోనే ఒక వెలుగువెలిగిన నేత ఆయన.. జిల్లా రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు నాంధీ పలికిన ఆ నాయకుడు.. నేడు అసామాన్యుడిగా మారిపోయాడు.. పార్టీనే ఒంటిచేత్తో నడిపించిన ఆ వ్యక్తి..ఇప్పుడు ఏం చేయలేని నిశ్ఛాయస్థితిలో ఉండిపోయాడు.. ఒక రాష్ట్ర సీఎంకే అతి సన్నిహితంగా మెలిగిన ఆయన మారుతున్న రాజకీయ పరిణామాలకు బలిపశువైయ్యాడు.. ప్రత్యర్థలను వణికించే సామర్థ్యం కల్గిన ఆ నాయకత్వ బలం ఉన్నప్పటికి పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నాడు.. ఏమిలేని సమయంలోనే ప్రజాప్రతినిధులను గెలిపించుకున్న ఆ నేత అవమానాలను ఎదుర్కోంటూ రాజకీయ చేస్తున్నాడు.. అలాంటి నాయకుడు అధికార పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అంతర్మథనంలో పడిపోయాడు..

అందర్ని అప్యాయతగా పిలిచే ఆ నాయకుడు అవసరమైతే తప్ప స్పందించడం లేదు.. అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు.. దీంతో ఆయన వర్గీయులు ఆనేతపై ఒత్తిడి చేస్తున్నారు.. మనకొద్దు ఈ పార్టీ వదిలేద్దాం.. బయటకు వెళ్దాం అంటూ త్రీవమనోవేదనతో వేడుకుంటున్నారు…? అవమానాలు మనకోద్దు.. బయటకు వెళ్లి బలమేంటో చూపిద్దామని చెబుతున్నారు..? అసలు ఆ నేతకు అధికారపార్టీలో అవమానాలు జరుగుతున్నాయా…? ఆయన వర్గీయులు పార్టీ వదిలి వెళ్లిపోదామని అడుగుతున్నారా..? లేదంటే జరుగుతున్న పరిణామాలకు ఆయనే పునరాలోచనలో పడ్డాడా..? ఖమ్మం రాజకీయ దిరుందరుడి స్థితిగతి ఏంటి..? ’విజయం‘ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనే ఆయనో సంచలనం.. వ్యాపారవేత్తగా, కాంట్రాక్టర్ గా ఉన్న ఆ నాయకుడు గత 7ఏళ్ల క్రితం ఉన్నట్టుండి కొత్తపార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూర తిరిగిన ఆయన జిల్లాలోనే సమర్థవంతమైన నాయకుడిగా తయారైయ్యాడు. కొత్తపార్టీ అయినప్పటికి ఊరూరా పార్టీని విస్తరించి బలోపేతం చేశారు.. పార్టీ అధినేతకు అత్మీయమిత్రుడిగా దగ్గరై ఒక రాష్ట్రానికే అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత జరిగిన సాధాహరణ ఎన్నికల్లో ఆయనతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించడంలో కీలకమైయ్యాడు. తరువా ఎంపీటీసీ,జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి మూడవ స్థానంలో నిలిచే విధంగా కష్టపడి పనిచేశారు. అధినేత వద్ద మంచి మార్కులు సాధించాడు. కాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ఆయనతో పాటు ఆయన వర్గీయులతో కలిసి అధికారపార్టీలో చేరారు. అయినప్పటికి ఊరూరా తిరుగుతూ ఆనాటి మంత్రితో కలిసి పనిచేశాడు. కానీ..?
** నష్టం బాధ్యత ఆయనపై..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల ముందస్తు ఎన్నికలకు వెళ్లగా 2018 డిసెంబర్ మాసంలో సాధాహరణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 1 సీటు మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. 9 స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఖమ్మం జిల్లాలో మిశ్రమ ఫలితాలు రావడం పట్ల సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. అంతేకాదు.. రాష్ట్ర మంత్రివర్గంలోనే ప్రాథన్యత కల్గిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. దీంతో నష్టం అంతా ఒక్క నేతపై పడింది..? ఆ నాయకుడి వల్లనే పార్టీ అన్ని స్థానాలను కోల్పోయిందని అప్పుడున్న నాయకత్వం నేరుగా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రభావం కాస్త పార్లమెంట్ ఎన్నికల్లో పడింది.

allso read :- పొమ్మనలేక..? ** ఆ పని చేసింది ఆయనేనంటా..? అందరి నోట అదేమాట

ఆ నేతకు జరగాల్సిన నష్టం జరిగింది. అలాగే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ నేత సహాకరించలేదని ఎదురుపార్టీ వారికి కూడా డబ్బులు ఇచ్చారనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. దీంతో మరోసారి అవమానాలు తప్పలేదు. ఆతరువాత జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బాధ్యత కూడా ఆ నేతపైనే పడింది. ఈ విషయం జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆయనపైనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. ఫిర్యాదు ఎవరిపై చేశారనే విషయం ఆ పార్టీ అంతర్గత విషయమైనప్పటికి కచ్చితంగా ఆ నాయకుడిపైనే ఫిర్యాదు చేసినట్లు బయట విస్త్రతంగా ప్రచారం జరిగింది.
** బయటకేళ్దామంటున్న ఆయన వర్గీయులు..?
రాజకీయ పరిణామాల ఫలితంగా ఆ నేత వర్గీయులు అసహానానిక గురవుతున్నారు.. అనేక ధపాలుగా మా నేతను అవమానాలకు గురి చేస్తున్నారని అసంతఈప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు అవమానిస్తారని బహిరంగంగానే అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇక చాలు ఆయనపై చూపిన ప్రేమకు వందనాలు.. ఇక మాకోద్దు ఈ పార్టీ అంటూ సోషల్ మీడియాలో ఆ నేతకు చెందిన వర్గీయులు పోస్టులు చేసిన పరిస్థితి నేలకొంది. అధికార పార్టీలో కొందరు పదేపదే మా నేతను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక చాలు.. అవమానాలు మనకోద్దు.. బయటకు వెళ్దాం సార్..? అంటూ ఆయన వర్గీయులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మీరు బయటకు వస్తారా..?

all so read:- ఖమ్మం సాగర్ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు

మమ్మల్నే కూడగట్టుకుని రాజకీయాలను వదిలేయమంటారా..? అంటూ ఆ నేతను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.. మీకే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము అవమానాలు భరించాల్సి వస్తోందని, పార్టీ కార్యాక్రమాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదని, ఇలా ఎన్ని రోజులు అవమానాలతో రాజకీయాలు చేయాలో చెప్పండి అని ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ పార్టీ లోకి లేదంటే వైసీపీ పార్టీలోకి వెళ్దామని ఆ నాయకుడిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సీటు ఇవ్వకుండా అవమానించడం, క్రాస్ ఓటింగ్ కు మనల్నే కారణంగా చూపించడం పట్ల ఆయన వర్గీయులు మరింతగా ఆగ్రహంతో ఆ నాయకుడిపై వాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ..ఆ నాయకుడేం చేస్తున్నారంటే..?
** అతిత్వరలోనే నిర్ణయం..?
ఒకవైపు పార్టీలో ప్రాథాన్యత కల్పించకపోవడం, ఎలాంటి పార్టీ పదవులు లేకుండా, నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా ఉండటం, ప్రతి ఎన్నికల్లో బాధ్యుడిగా చేస్తూ అధినేతకు ఫిర్యాదు చేయడం, ఆయన వర్గీయులు గ్రామీణా ప్రాంతాల్లో అవమానాలు ఎదుర్కోనడం… ఆయన పై వర్గీయులు తీవ్ర ఒత్తిడి చేయడం ఫలితంగా ఆ నేత పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.. ఆ పార్టీని వీడే విషయంలో అంతర్మథనంలో పడిపోయినట్లు సమాచారం. ఆయన గురువులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులను సంప్రధిస్తున్నట్లు తెలుస్తోంది.. పార్టీలోనే ఉండాలా..? పార్టీ వీడితే ఏ పార్టీలో చేరాలి..?

చేరిన తరువాత వచ్చే పరిణామాల సంగతేంటి..? అనే విషయాలపై చాలా సుధీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.. అతిత్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న ఒత్తిడికి మాత్రం ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఎక్కడ కూడా పార్టీపై రియాక్ట్ కావడం లేదు. మాకు నాయకుడు సీఎం కేసీఆర్, ఆయన బాటలోనే నడుస్తామని చెబుతున్నారు. కార్యకర్తలు, నాయకులకు సర్థి చెబుతున్నారు. మనకు మంచిరోజులు వస్తాయి..ఎవరు తొందరపడోద్దని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయం,ఇందులో విజయాలు, అపజయాలు ఉంటాయి.. అంత మాత్రానా పార్టీలు మారాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు దైర్యం చెబుతున్నట్లు తెలుస్తోంది. సమయం వచ్చినప్పుడు ఆపిన ఆగదు.. మంచికాలం ముందున్నది, అందరికి నేను ఉన్నాను, నేను అందర్ని అదుకుంటానని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది..? అయితే ఢిల్లీ సంగతేంటి..? ఢిల్లీలో ఓ నేతకు టచ్ లోకి వెళ్లిన మాట వాస్తవేమానా..? తప్పుడు ప్రచారామా..? రేపటి సంచికలో..?

 

also read :-చలి పంజా