Telugu News

భారీ మెజారిటీతో సోనియమ్మ కు కానుకిద్దాం: పొంగులేటి 

అశ్వారావుపేట కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి

0

భారీ మెజారిటీతో సోనియమ్మ కు కానుకిద్దాం: పొంగులేటి 

– అశ్వారావుపేట కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి

– ప్రజా సేవకే రఘు రాం రెడ్డి పోటీ చేస్తున్నారు: మంత్రి తుమ్మల

(అశ్వారావుపేట-విజయం న్యూస్)

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించి.. సోనియమ్మ కు కానుక అందజేద్దాం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఏర్పాటు చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం లో మాట్లాడారు. ఉత్కంఠ తర్వాత టికెట్ ను అధిష్టానం పరిపరి విధాల ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేసిందని తెలిపారు.

ఇది కూడా చదవండి:- రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..*

అన్ని నియోజక వర్గాల్లో ముగిశాక మండల స్థాయిలో కూడా కీలక సమావేశాలు పెడతామని అన్నారు. దేశ సమైక్యత కోసం, రాహుల్ గాంధీనీ ప్రధాని చేసేందుకు..తెలంగాణ లోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి కే సీ ఆర్ కు వాత పెట్టారని, లోక్ స ఎన్నికల్లో నూ అదే గతి పడుతుందని ఎద్దేవా చేశారు.
రఘు రాం రెడ్డి కోసం అంతా శ్రమించాలని కోరారు.

== రఘు రాం రెడ్డి కుటుంబానిది సేవా గుణం..: తుమ్మల*

రామ సహాయం రఘు రాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి గతంలో నాలుగు సార్లు ఎం పీ గా, నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఎంతో సేవ చేశారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకు తనవంతుగా సేవ చేసేందుకే పోటీ చేస్తున్నారని తెలిపారు.

== నేను ఔటర్ కాదు..లోకల్: రఘురాం రెడ్డి*
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి మాట్లాడుతూ.. తనది కూసుమంచి మండలం చేగొమ్మ స్వగ్రామం అని, రాజకీయ ప్రత్యర్ధులు అంటున్నట్లు ఔటర్ కాదు అని..నేను లోకల్ అని తెలిపారు. ప్రజా సేవకే ఈ జీవితం అంకితం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర నాయకులు మువ్వా విజయ్ బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, జెడ్పీ టీసీలు, ఎంపీ టీసీ లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- వాకింగ్ చేస్తూ.. ఓట్లు అభ్యర్థించిన RRR