Telugu News

కార్మిక హక్కుల పరిరక్షణకై ఉద్యమిద్దాం

ఏన్కూరు మండలంలో ఘనంగా మేడే కార్యక్రమం

0

కార్మిక హక్కుల పరిరక్షణకై ఉద్యమిద్దాం

== ఏన్కూరు మండలంలో ఘనంగా మేడే కార్యక్రమం

(ఏన్కుర్-విజయం న్యూస్):
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఏన్కుర్ లో ప్రధాన సెంటర్ లో సీపీఐ, ఏఐ టియుసి అధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. సీనియర్ నాయకులు గోరంట్ల సత్యం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్ మాట్లాడుతూ అమెరికా లోనీ చికాకో నగరంలో కార్మికుల పని దినాల కోసం సాగిన పోరాటంలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు.వారి ప్రాణాల త్యాగాలతో ఏర్రుపెక్కిన ఎర్ర జెండా ప్రపంచ వ్యాప్తంగా 8గంటల పని దినాలను సాధించడమే కాకుండా అనేక కార్మిక చట్టాలను సాధించుకున్న యన్నారు.అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పించడం లో ప్రధాన భూమికను పోషించిన ఘనత కేవలం ఏఐటియూసి,సిపిఐ కి మాత్రమే ఉందన్నారు.

ఇది కూడా చదవండి:- చెక్ డ్యాంలను పరిశీలించిన జాయింట్ కమిషనర్

అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించిన హక్కులు,సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ,కార్మిక చట్టాలను సవరిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించాలని పిలుపు నిచారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు అమరనేని వీరభద్రమ్,ఏఐటియూసి జిల్లా ఉపధ్యక్షుడు మంకెన కృష్ణ, నాయకులు మదినెని వెంకన్న, తాళ్లూరి రమణ,నర్సింహారావు,రాకేష్, బసవయ్య వెంకటేశ్వర్లు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.