Telugu News

కేసిఆర్ నాయకత్వంలో ముందుకు సాగుదాం: చంద్రావతి

వైరాలో మాజి ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతికి ఘన స్వాగతం..

0
కేసిఆర్ నాయకత్వంలో ముందుకు సాగుదాం: చంద్రావతి
==  కార్యకర్తలకు అండగా ఉంటా.
==  నియోజకవర్గాన్ని అభివద్ది చేసుకుందాం…
==  వైరాలో మాజి ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతికి ఘన స్వాగతం..
== పార్టీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన డాక్టర్ బానోత్ చంద్రావతి..
==  తెలంగాణ గిరిజన సాంప్రదాయ, కోలాట నృత్యాల నడుమ భారీ ర్యాలీలో  డాక్టర్ చంద్రావతి..*
==  కార్యకర్తలను, నియోజక ప్రజలతో డాక్టర్ చంద్రావతి  ఆత్మీయ పలకరింపు..
== 2000 మంది ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చిన అశేష జనవాహిని..        
== ‌‌ ర్యాలీలో స్టెప్పులేసిన  డాక్టర్ చంద్రావతి.
(ఖమ్మం ప్రతినిధి,-విజయం న్యూస్)
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనమంతా ముందుకు సాగుదామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్దామని వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి అన్నారు..
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చంద్రావతి వైరా విచ్చేసి తన క్యాంపు కార్యాలయం ఎదుట గులాబీ జెండాను ఆవిష్కరించారు..తొలుత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ భానోత్ చంద్రావతికి తెలంగాణ సాంప్రదాయాలతో కోలాట నృత్యాలతో కళాకారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రావతి  మాట్లాడుతూ..కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్తను కలుసుకొని,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. మనందరి కుటుంబపెద్ద సీఎం కేసీఆర్ అని, కేసీఆర్  సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరిడవిల్లుతుందన్నారు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనమంతా మననియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లడంలో సీఎం సలహాలు సూచనలు ఆదేశాలను పాటిస్తూ పయనిద్దామని పిలుపునిచ్చారు..జెండా పండుగ కార్యక్రమానికి విచ్చేసిన అశేష జనవాహిని, కళాకారుల బృందం,తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నృత్యాలుచేసిన గిరిజన సహోదరిమణులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు,పార్టీ శ్రేణులకు,తనఅభిమానులకు వైరా నియోజకవర్గ ప్రజలందరికీ పేరుపేరునా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు.  ఈ ర్యాలీ అద్యాంతం జై కేసిఆర్, జై కేటిఆర్, జై చంద్రావతి  అంటూ కార్యకర్తలు పెద్ద యెత్తున నినాదాలతో  వైరా నగర పురవీధులు  మార్మోగాయి….మొత్తం 2000 మంది ప్రజలు ఈ జండా పండుగ కార్యక్రమానికి హాజరు కాగా,  యువతీ యువకులు డాక్టర్ చంద్రావతితో సెల్ఫీలు దిగారు..
ఈ కార్యక్రమంలో. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ బానోతు నీల, బానోతు చిన్న, బానోతు థావరియా, అమర్లపూడి లాజరు, మాజీ సర్పంచులు కొత్త వెంకటేశ్వర్లు, అమర్లపూడి మేరమ్మ, పోట్ల గోపాల్ రావు, అమర్లపూడి అనిల్, సాంబశివరావు పరిటాల వీరయ్య, గడ్డం మల్లేశ్వరరావు,   పెరుగు గురవయ్య, తెలంగాణ ఉద్యమకారులు మందడపు శంకర్, బాణాల కాంతచారి, హనుమాయమ్మ, కిలారి పుల్లారావు, ఇటుకల రాజు, కళ్యాణ్, పార్టీ శ్రేణులు కార్యకర్తలు డాక్టర్ చంద్రావతి అభిమానులు తదితరులు పాల్గొన్నారు..