Telugu News

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: భట్టి విక్రమార్క

పేదల భూములను మింగుతున్న సర్కార్ ను తరమికొడదాం

0

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: భట్టి విక్రమార్క

== పేదల భూములను మింగుతున్న సర్కార్ ను తరమికొడదాం

== ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం కేసీఆర్ పరిపాలనలో

== రాజ్య హింసపై మేధావులు మాట్లాడాలి

== విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

==  మహేశ్వరంలో కొనసాగిన పాదయాత్ర

(నల్గొండ/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నిరుపేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ, పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజా చైతన్యం కోసం గత కొద్ది రోజులు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్న సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర మహేశ్వరం మండలంలో 54వ రోజు కొనసాగింది.

ఇది కూడా చదవండి: సత్తుపల్లి లో దారుణం..ముగ్గురు మృతి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నమంత్రులు ఇష్టానుసారంగా పేదల భూములను మింగేస్తున్నారని, బెదిరించి భూములను లాగేసుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇండ్లు ఇవ్వకపోగా, గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి లాక్కుంటున్నారని ఆరోపించారు. రాజ్యహింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం లో చూస్తున్నామని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాటి చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున రాజ్య హింస భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో  చూపిస్తున్న బిఆర్ఎస్ సర్కార్ కే దక్కిందన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్దంగా, మౌనంగా, కనిపించకుండా  ప్రభుత్వం రాజ్య హింస చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ధమనకాండ పై ప్రజాసంఘాలు, సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు పేదలకు అండగా నిలబడేవి. కానీ ఇప్పుడు పేదల భూములను బలవంతంగా గుంజుకుంటున్న ఏ ఒక్కరు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాలు హక్కుగా పేదలకు ఇచ్చిన భూమి లాక్కునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. బలవంతంగా పేదల నుంచి లాక్కోవడం రాష్ట్రంలో ఈ పేదలను బతుకనివ్వ ద్దనచన దుర్మార్గమైన ఆలోచన బీఆర్ఎస్ చేస్తోందని, బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాజ్య హింసపై మేధావులు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే ఐదు లక్షల కోట్ల విలువైన పదివేల ఎకరాలను ఈ ప్రభుత్వం పేదలను భయపెట్టి బలవంతంగా గుంజుకున్నదని, ఆ భూమి పై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. హైదరాబాద్ చుట్టూ 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ఈ ప్రభుత్వం గుంజుకున్నది ఇది పేదల పట్ల జరుగుతున్న అతిపెద్ద కుట్ర జరుగుతోందని,

ఇది కూడా చదవండి: ఆడబిడ్డకు చీరేను బహుకరించిన భట్టి

పేదల నుంచి గుంజుకున్నా భూములను సంపన్న వర్గాలకు కంపెనీలకు,  హెచ్ఎండిఏ లేఔట్ చేయడానికి కేటాయించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు హక్కుగా ఇచ్చిన భూములు గుంజుకునే హక్కు ఎవరికీ లేదు. వచ్చే జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. మీ భూముల్లో మీరు అరక పట్టి దుక్కి దున్నుకొని పంట పండించుకోవడానికి సిద్ధం కండి. మీకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి సమాయత్తం కండి. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్, నాదర్గుల్, ఆల్మాస్గూడ, మామిడిపల్లి లో గత కాంగ్రెస్ ప్రభుత్వం 4 వేల మంది పేదలకు ఇచ్చినా  ఇండ్ల స్థలాలను బలవంతంగా గుంజుకోవడాన్ని ఖండిస్తున్నామని, పేదల పక్షాన కోట్లాడటానికి, ప్రభుత్వ మెడలు వంచిపేదలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. జిల్లాలగూడ, మీర్పేట్, కురుమల్ గూడ లో గత ప్రభుత్వం కట్టి న నాలువేల ఇండ్లను 9 సంవత్సరాలుగా పంపిణీ చేయకుండా గుప్పిట్లో పెట్టుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మన హక్కులను కాలరాయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. కురుమలగూడ లో గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన 4వేల ఇండ్లను రెండు నెలల్లో పేదలకు పంపిణీ చేయకుంటే… కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో పేదలను ఇండ్ల

ఇది కూడా చదవండి: తెలంగాణ అంటే సీఎం జాగీరా: ప్రియాంకగాంధీ

వద్దకు తీసుకువెళ్లి గృహప్రవేశం చేయిస్తామని భరోసానిచ్చారు. మహేశ్వరం మండలంలో ఫార్మాసిటీ కంపెనీ కోసం 500 ఎకరాలను లాక్కోవడంతోపాటు మరో 400 ఎకరాలను బఫర్ జోన్లో పెట్టిన ప్రభుత్వం, వెయ్యి ఎకరాలు తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్న భూముల్లో లబ్ధిదారుల చేత దున్నిస్తం, గుంజుకున్న ఇంటి స్థలాలను తిరిగీ పంపిపిణీ చేస్తాం, కట్టిన ఇల్లు పంపిణీ చేయకుండా ఉంటే గృహప్రవేశం చేయిస్తాం, వ్యవసాయానికి ఉపయోగం లేని భూమిలో పేదలకు వ్యాపారాలు చేసుకోవడానికి కేటాయిస్తామని, 2023- 24లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చేంత వరకు మీ భూములు దోపిడీ కాకుండా మీరే కాపాడుకోవాలని అన్నారు. అధికార యంత్రాంగం, న్యాయస్థానాలు, మీడియా, సామాజిక బాధ్యత ఉన్న రాజకీయ పార్టీలు బిఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీకి వ్యక్తిరేకంగా ప్రజలకు అండగా ఉండాలన్నారు.

== పేదల భూములు దగా చేసేందుకే ధరణి వచ్చింది : గద్దర్

200 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలు కాపాడుకుంటున్న భూములను వారికి లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ దగా చేయడానికి ధరణి తీసుకొచ్చారని ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆరోపించారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలన కట్టింది కూల కొట్టు. కమిషన్లు కొట్పు. ఎన్నికల్లో పంచి పెట్టు. గద్దెనెక్కు అన్న చందంగా నడుస్తున్నదని, ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన పత్రికలు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వారికి హక్కుగా ఉన్న ఇంటి స్థలాలు వెంటనే కేటాయించాలని అన్నారు.

ఇది కూడా చదవండి: మహేశ్వరంలో భట్టి పాదయాత్రకు అడుగడుగున నిరాజనం

తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల విప్లవం రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు  ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఈ ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విధానాలను వివరించి చైతన్య పరిచి కెసిఆర్ ప్రభుత్వం గద్దె దింపే విధంగా ఓట్లు పోలరైజ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్లు లేకుండా పోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదన్నారు. ప్రజల సంపదను దోపిడీ చేయడమే కాకుండా లక్షల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తూ   ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు మెయిన్టెనెన్స్ ప్రైవేట్ ఏజెన్సీ కి అతి తక్కువగా 30 ఏళ్లకు లీజుకి ఇచ్చి అతిపెద్ద స్కాంకు పాల్పడిన బిఆర్ఎస్ ప్రభుత్వం, ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించినట్టే ఈ రాష్ట్రాన్ని కూడా అమ్మేయడానికి సీఎం కేసీఆర్ వెనుకాడడు అని తెలిపారు. మన తెలంగాణను మనం రక్షించుకోవడం కోసం మరో పోరాటానికి సిద్ధమవుదామని, గత ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన భూముల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాదర్గుల్ లో పంపిణీ చేసిన 372 ఎకరాలను కొంతమంది దాని చుట్టూ కంచే వేసి ఆక్రమణకు పాల్పడాలని చూస్తున్నట్టు తెలుస్తున్నదన్నారు.

ఇది కూడాచదవండి: ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం: భట్టి విక్రమార్క

అధికార బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై పేదల భూములు కబ్జా చేయాలని చూస్తే ఖబర్దార్ అని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన 5 లక్షల కోట్ల విలువైన భూములను బలవంతంగా గుంజుకున్నదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన భూములను అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వెనక్కి తీసుకున్న వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగి వెనక్కి తీసుకొని పేదలకు ఇచ్చి పట్టాలు కూడా ఇస్తామని తెలిపారు. యువ సంఘర్షణ సభలో చేసిన హైదరాబాద్ డిక్లరేషన్ను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తందని, విద్యార్థి నిరుద్యోగుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అండగా ఉంటుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో చేయి గుర్తుపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారి బిఆర్ఎస్ లోకి వెళ్లడం దురదృష్టకరమని, మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా సబిత ఇంద్రారెడ్డి పార్టీ మారి నియోజకవర్గ ఓటర్లను మోసం చేసినందుకు కాంగ్రెస్ పక్షాన ప్రజలకు క్షమాపణ చెప్తున్నామని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇండ్లను పంపిణీ చేయకుండా మంత్రి సబిత ఇంద్రరెడ్డి అడ్డుగా నిలబడడం తగదన్నారు. నెల రోజుల్లో కట్టిన ఇండ్లను పంపిణీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీగా పేదలను తీసుకొచ్చి గృహప్రవేశం చేస్తామని తెలిపారు.