చెక్ గేట్లతో అడవులను కాపాడుదాం….
అటవీశాఖ రేంజర్ చలమల శ్రీనివాసరావు
(చండ్రుగొండ -విజయం న్యూస్ ) :-
చెక్ గేట్లతో అడవులకు పూర్తిస్థాయి రక్షణ కలుగుతుందని అటవీశాఖ రేంజర్ చలమల శ్రీనివాసరావు స్పష్టం చేశారు శుక్రవారం బెండలపాడు అటవీప్రాంతం వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ గేటును మండల స్థాయి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన అడవుల రక్షణపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెక్ గేట్లు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకూ మూసివేసి ఉంచటం జరుగుతుందన్నారు అటవీభూములో చెట్లను నరుకుట చట్టరీత్యా నేరం అదేవిధంగా జంతువులను వేటాడిన కేసులు నమోదు చేస్తామన్నారు
also read :-నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య
అటవీభూమిలో ఎలాంటి నేరము జరిగిన శాటిలైట్ ద్వారా గుర్తించి వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఆర్ ఓఎఫ్ ఆర్ భూముల్లో సైతం ఎలాంటి చెట్లను నరికిన నేరమవుతుందన్నారు ప్రభుత్వ భూముల్లో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికిన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సిఐ వసంత కుమార్ ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి ఎంపీడీఓ అన్నపూర్ణ మండల ప్రత్యేకాధికారి సంజీవరావు డిప్యూటీ తహసిల్దార్ ప్రసన్న మండల పంచాయతీ అధికారి తోట తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు