Telugu News

విజయభేరిలో ఖమ్మం సత్తా చాటుదాం: మువ్వా విజయ్

0

*విజయభేరిలో ఖమ్మం సత్తా చాటుదాం: మువ్వా 

== సోనియమ్మకు నీరా’జనం’ పలుకుదాం*

== తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు*

==  పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం*

(ఖమ్మం-విజయం న్యూస్):

కేసీఆర్ పునాదులు కదిలించే విజయభేరికి భారీగా తరలివెళ్లి సోనియమ్మకు నీరా’జనం’ పలికి ఖమ్మం సత్తా చాటుదామని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్ లో నిర్వహించనున్న విజయభేరి భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వస్తున్న సందర్భంలో సభకు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలనే సద్దుదేశ్యంతో ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.

 ఇది కూడా చదవండి:- అధికారం పక్కాగా కాంగ్రెస్ దే : మువ్వా

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మువ్వా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కోసం చారిత్రక డిక్లరేషన్స్ ప్రకటించనున్న సోనియమ్మ సభకు మనమందరం వేలాదిగా తరలి వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సభకు ఒక్క రోజు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని నగరంలోని ఆయా డివిజన్లు, రఘునాథపాలెం మండలంలోని బాధ్యులకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనానికి ఈ సభ పునాదిగా మారనుందని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా సీఎం కేసీఆర్ పాలనపై ఇదే సభలో ఛార్జిషీట్లు విడుదల అవుతాయని తెలిపారు.

ఇది కూడా చదవండి:- గడప గడపకు మువ్వా విజయ్…!

సోనియాగాంధీ ప్రకటించే డిక్లరేషన్ అమలు గ్యారంటీ కార్డును ఇంటింటికి అందించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులెంటో మనం వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కావున నియోజకవర్గంలోని ప్రతీ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, అభిమాని ఈ సభకు రావాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, ఎండీ ముస్తఫా, కొప్పెర ఉపేందర్, రామ్మూర్తి, తమ్మిన్ని నాగేశ్వరరావు, మియాభాయ్, ఇమామ్ భాయ్, నగర ఓబీసీ సెల్ చైర్మన్ బాణాల లక్ష్మణ్, ఎంపీటీసీ అశోక్, కీసర పద్మజా రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, రమాదేవి తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:- మంత్రి పువ్వాడ పై మువ్వా విజయ్ పైర్