Telugu News

అంబేద్కరుడి ఆశయ సాధన కోసం పనిచేద్దాం:భట్టి

ఖమ్మం డిసిసి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భట్టి విక్రమార్క

0

అంబేద్కరుడి ఆశయ సాధన కోసం పనిచేద్దాం: భట్టి విక్రమాార్క

== అందర్ని ఐక్యం చేసిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్

== ఆయన ఇచ్చిన రిజర్వేషన్లే నేటి పేదలకు వరంగా మారాయి

== ఖమ్మం డిసిసి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న

డా.బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పనిచేయాలని, ఆయన ఆశయాలను అమలు చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైన ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్  వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి  సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్  ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  సంజీవరెడ్డి భవనంలో పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్  ఈ దేశంలో పుట్టడం భారతదేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు ఆయన చూపిన మార్గం ఈ దేశానికి అందించిన రాజ్యాంగమని అన్నారు.  ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే కాకుండా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమానత్వంతో కూడిన స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన లౌకికవాదం, సర్వసత్తాక గణతంత్ర భారతదేశాన్ని అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కల్పించిందన్నారు. మహిళలకు కావలసిన అన్ని హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచారని, కార్మికులకు కల్పించాల్సిన హక్కులు సంక్షేమం తో పాటు కార్మికుల రక్షణకు కల్పించాల్సిన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. బలహీన వర్గాలకు కావలసిన హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించారని,

allso read- క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉంది

ప్రతి మనిషి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచన చేయడమే కాకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా నమ్మిన ధర్మాన్ని స్వేచ్ఛ గా ఆచరించే హక్కు రాజ్యాంగం ద్వారా కల్పించారని గుర్తు చేశారు. దేశంలో నిషిద్ధ విప్లవానికి కారణమైన గ్రంథం రాజ్యాంగం. ఈ మహా గ్రంధం అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆలోచనలు పాటించడం, అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.  ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్యం, బొడ్డు బొందయ్య, కార్పోరేటర్లు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, నాయకులు మద్ది వీరారెడ్డి, ఏటూకురి రవికుమార్, లక్ష్మణ్ తదితరులు హాజరైయ్యారు.