గ్రంథాలయాలే… ఆధునిక దేవాలయాలు!
చరిత్రను తెలియజేసేవి పుస్తకాలు సీఎం కేసీఆర్ పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు యువత, విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు సూచన
గ్రంథాలయాలే… ఆధునిక దేవాలయాలు!
చరిత్రను తెలియజేసేవి పుస్తకాలు
సీఎం కేసీఆర్ పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు
యువత, విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు సూచన
(ఖమ్మం – విజయంన్యూస్):-
గ్రంథలయాలే… ఆధునిక దేవాలయాలని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు అభివర్ణించారు.
పుస్తకాల అధ్యయనంతోనే ప్రతి మనిషి మనో వికాసం పొందుతాడని చెప్పారు.
మన రాష్ట్ర సీఎం కేసీఆర్ విస్తృతంగా పుస్తకాల అధ్యయనం చేస్తారని ఆయనకి పుస్తకాలు చదవడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కొత్తూరు ఉమా మహేశ్వరావు జిల్లా గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేశారు. ఖమ్మం నగరంలోని VVC ఫంక్షన్ హాల్ నందు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తాను నిరంతరం కృషి చేస్తున్నట్టు నామ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వీరయ్య ఏ పని అయినా.. ముఖ్యమంత్రితో కానీ మంత్రులు తో కానీ పని చేయించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని కొనియాడారు.
also read :- మన్యంలో ‘కాంతన్న’ కంటి వెలుగులు
ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీని తీసుకొస్తారని గుర్తు చేశారు. ఉమా మహేశ్వరరావుకి మంచి పదవి ఇవ్వాలని తొలి నుంచి ఎమ్మెల్యే, తాను తపించి సీఎం కేసీఆర్ను ఒప్పించినట్టు ప్రత్యేకంగా చెప్పారు. ఖమ్మంలో గ్రంథాలయ అభివృద్ధికి తాను సహకరిస్తానని ఎంపీ నామ నాగేశ్వర్రావు హామీనిచ్చారు. అయితే ఆర్యవైశ్య సోదరులు అందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒక మనిషి జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చని, కానీ తెలివి సంపాదించాలంటే మాత్రం పుస్తకాలతోనే సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలివి సంపాదించాలంటే గ్రంధాలయం ఉపయోగపడతుంది అన్నారు. దేవుడి గుడికి ఏ విధంగా వెళతామో… గ్రంథాలయం చెంతకు అదే విధంగా వెళతామని అన్నారు.
ఆ గ్రంథాలయాల్లో ఉన్న చరిత్ర ప్రతి ఒక్కరికూ చదవాలని సూచించారు. ఇటీవల తాను సీఎం కేసీఆర్ వద్ద కూర్చొని సంభాషణ జరుపుతున్న సమయంలో, ఆయన ఖమ్మం జిల్లా చరిత్ర చెప్పారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా నేతలకు సంబంధించిన గురించి సైతం తనతో చర్చచేశారని వివరించారు. ఈ విషయాలన్నీ ఆయనకు విపరీతమైన అధ్యయనం వల్లనే తెలిశాయని అన్నారు.
పుస్తక పఠనం ఆయనకు ఆ స్థాయిలో విజ్ఞాన పొందేందుకు దోహదపడిందని ఎంపీ నామ నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
also read :- గ్రానైట్ సమస్యలపై మంత్రి పువ్వాడ చూపిన చొరవ.
ఈ తరం యువత, విద్యార్థులు పుస్తకాల ద్వారా జ్ఞానం పొందాలని సూచన చేశారు.
తాను పార్లమెంట్ గ్రంథాలయ కమిటీ ఛైర్మన్గా ఉన్నానని, అందుచేత తాను ఖమ్మం జిల్లా గ్రంథాలయానికి సాయం చేస్తానని అన్నారు. పార్లమెంట్ గ్రంథాలయంలో 15 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం డిజిటలైజ్ చేస్తున్నామని వెల్లడించారు. 40 వేలకు పైగా పుస్తకాలు ఖమ్మం గ్రంథాలయంలో ఉన్నాయని తనకు తెలిసిందని… ఇది చాలా గొప్ప విషయమని అన్నారు.
వీటిని జిల్లా విద్యార్థులు, యువత ఈ పుస్తక సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు….ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మెళ్ళచేరువు వెంకటేశ్వరరావు, కొప్పు నరేష్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, కొత్తూరు ప్రభాకర్, పసుమర్తి చందర్ రావు, వనమా వాసు, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
also read :- నేతాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ .