Telugu News

టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో గోదావరిఖని లో పేకాట స్థావరం పై మెరుపు దాడి.

టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో గోదావరిఖని లో పేకాట స్థావరం పై మెరుపు దాడి.

0

టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో గోదావరిఖని లో పేకాట స్థావరం పై మెరుపు దాడి.

టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో గోదావరిఖని లో పేకాట స్థావరం పై మెరుపు దాడి.

43,2300/- రూపాయల నగదు, 06 సెల్ ఫోన్లు,ఒక మోటార్ సైకిల్ స్వాధీనం.

 

(పెద్దపల్లి జిల్లా – విజయం న్యూస్) :-

రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ అధ్వర్యంలో ఎస్ఐ లు షేక్ మస్తాన్, CH.నర్సింహా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని – 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని GM ఆఫీసు ఏరియా సింగరేని క్వార్టర్ నo. T-2- 309, రావుల బనాకర్ క్వార్టర్ నందు కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని *పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసి 7 జూదరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది, పట్టుబడిన వారి వద్ద నుండి 06 సెల్ ఫోన్లు 43,230/-నగదు, పేక ముక్కలు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనపరచుకోవడం జరిగింది.
పట్టుపడిన వ్యక్తులు
1. రావుల బనాకర్,
2. పెరుగు రాకేశ్,
3. కూర శ్రీనివాస్,
4. కొలమ్ సాయి,
5. ఎం‌డి. జూనైద్ ఖాన్,
6. పులి విజయ్,
7. ఆదెండ్ల చంద్ర.
పట్టుకున్న నిందితులను మరియు స్వాధీనపరుచుకున్న నగదు, 06 సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్, పేక ముక్కలను తదుపరి విచారణ కొరకు గోదావరిఖని ఒకటవ పట్టణ పోలీస్ వారికి అప్పగించడం జరిగిందని సీఐ రాజ్ కుమార్ తెలియజేశారు.

ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ ఏం. రాజ్ కుమార్, ఎస్ఐ లు షేక్ మస్తాన్, సి.హెచ్ .నరసింహ, పి. సతీష్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్,మల్లేష్, తీట్ల శ్రీనివాస్, సతీష్ లు పాల్గొన్నారు.

Also read :-ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రశంసలు– ఖమ్మం పోలీస్ కమిషనర్. 

Also read :-ఈ దేశం నెహ్రూను ఎన్నటికీ మరువదు: బలరాం నాయక్.

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*