ఇష్టా రాజ్యం… అంతా మా ఇష్టం…!
చెలరేగిపోతున్న బట్టి మాఫియా…
అనుమతులు నిల్ …వ్యాపారం పుల్…
వలస కార్మికుల శ్రమను అడ్డంగా దోసుకుంటున్న వ్యాపారులు….
బట్టీలలో మోడువరుతున్న పసి బాల్యం…
పట్టించుకోని అధికారులు…
మణుగూరు విజయం న్యూస్:-
ఇష్టా రాజ్యం… అంతా మా ఇష్టం అనే రీతిలో అశ్వాపురం మండలంలో ఇటుక బట్టీల మాఫియా చెలరేగి పోతుంది మండలంలోని సుప్రసిద్ధ సాగునీటి వనరైన తుమ్మల చెరువు శివారు ప్రాంతాలతోపాటు గోల్లగూడెం,మొండికుంట, తుమ్మల చెరువు పంచాయితి లలో అక్రమంగా పదులకొద్ది ఇటుక బట్టీలను ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు లేకుండా ఏర్పాటు చేసి యద్దేశగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తూ వందలాది ట్రాక్టర్ల ద్వారాచెరువు మట్టిని తరలించి అక్రమ వ్యాపారం నిర్వహిన్నారు.ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయితీ పరిధిలో ఎటువంటి వ్యాపారాన్ని నిర్వహించాలన్న ఆయా పంచాయతీ కార్యదర్శులనుండి అనుమతులు పొందాల్సివుంటుంది. పంచాయతీ అనుమతితో పాటు అటవీ, పర్యావరణ రెవెన్యూ శాఖ అధికారుల నుండి సంబంధిత అనుమతులు తీసుకొని వ్యాపారాన్ని నిర్వహిచాలి.కానీ ఇవేమీ తమకి పట్టవు అనే చందంగా ప్రభుత్వ అనుమతులకు మంగళం పడుతూ యధేచ్చగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
also read;-అభాగ్యుల జీవితాలను నాశనం చేసినటువంటి వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలి
ఏటా ఒక్కో బట్టిలో లక్షలది గా ఇటుకలు తయారు చేసి కోట్లP రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఏఒక్క బట్టిలో ప్రభుత్వ నిబంధనలు మచ్చుకై పాటించకుండా ఎంచక్కా వ్యాపారాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వ, గ్రామ పంచాయతీ ల ఆదాయానికి భారీగా గండి కోడు తున్నారు.మరో పక్క ఇటుక బట్టిలలో ఇటుకలు తయారు చేసేందుకు పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, చత్తిసుగఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట రాష్ట్రాలనుండి ఏజెంట్ల ద్వారా కార్మికుల తీసుకువచ్చి వారితో రోజుకు పన్నెండు గంటలు పనిచేయించుకొని వారికి కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు సౌకర్యాలు కల్పించాకుండా వారి శ్రమను అడ్డండ దోసుకుంటున్నారు.కార్మికులకు ఇక్కడి భాష ప్రభుత్వ చట్టాలపై అవగాహన లేకపోవడం వ్యాపారులు మరింతగా రెచ్చి పోయి వారిపై పనిభారం మోపుతూ వారిని అందినకాడికి అడ్డంగా దొసుకుంటున్నారు.మరోవైపు జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వలస కార్మికులు తమ పసి పిల్లలను కూడా పనికి పంపడంతో బట్టీల యజమానులు వారితో కూడా వెట్టి చాకిరి చేయించు కోవడంతో పసిపిల్లలకు బాల్యం బట్టీల చాటున మగ్గుతోంది. కనీసం పసి వయసులో విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సింన చిన్నారులు సరస్వతి కటాక్షనికి నోచుకోక పోవడం విచారకరం. కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన కార్మిక పకడ్బందీ ఐసిడిఎస్ అధికారులు బట్టీలవైవు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
also read;-ద్రాక్ష గుడ్లు పెడుతున్న కేరళ కోడి…….
మరోవైపు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం హరితహారం పేరుతో తెలంగాణాలో భారీగా మొక్కలు నాటి అడవులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టి అడవులలో అంతరించి పోతున్న వివిధ రకాల వృక్ష సంపదను నాటి మొక్కల పెంపకం చేపట్టి అడవుల సంరక్షనే ధ్యేయంగా అటవీ శాఖకు భారీగా నిధులను మంజూరు చేయగా కొందరు ఆ శాఖ ఇంటి దొంగలతో లోపాయకారి ఒప్పందం చేసుకొన్న బట్టీల వ్యాపారులు సమీప అటవీ ప్రాంతం పై కన్నేసి సమీప అటవీ ప్రాంతంలో ని వృక్షాలను నేలకూర్చి యధేచ్చగా బట్టీల కు తరలించి ఇటుకల తయారీలో వృక్షాలను కాల్చి బుడిద చేస్తున్నారు.వందలాది టన్నుల కలప బట్టీలను తరలుతున్న పట్టించుకోవాల్చిన అటవీ శాఖ అధికారులు బట్టి యజమానులు ఇచ్చే నెలవారీ ముడుపుల కు అలవాటు పడి మిన్నుకుండి పోతున్నారనే ఆరోపణలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.అటవీ శాఖ అధికారుల అల సత్వంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యం నీరుగారి పోతుంది. ఇప్పటికైనా మండలంలోని అక్రమ బట్టీల వ్యాపారం పై సంబంధిత శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని,బట్టీలలో మొగ్గ వాడుతున్న పసి పిల్లలు రక్షించించి విద్య బుద్ధులు నేర్పేందుకు బాల కార్మిక సంరక్షణ కేంద్రానికి తరలించాలని పలువురు కోరుతున్నారు.