జమిలి ఎన్నికలు లేనట్లే..?
== ఇప్పటికిప్పుడు జమిలి సాధ్యం కాదన్న లా కమిషన్!
== పూర్తి స్థాయి అమలుకు సమయం పడుతుందన్న న్యాయ కమిషన్
== 2029వరకు పరిశీలించవచ్చు లా కమిషన్ అధ్యక్షుడు
By PENDRA ANJAIAH
(న్యూఢిల్లీ-విజయం న్యూస్)
ఈసారి జమిలి ఎన్నికలు లేనట్లేనా..? న్యాయ శాఖ కమిషన్ అదే చెబుతుందా..? అంటే నిజమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?
వన్ నేషన్..వన్ ఎలక్షన్ అనే పాలసీ తో దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలను నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఆలోచించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోపాటు కేంద్ర కేబినేట్ ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలను నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందని, అవినీతి జరిగే అవకాశం ఉండదని, గ్రామీణ స్థాయిలో అభివృధ్ధి పెరుగుతుందని, ప్రభుత్వాలు ఎన్నికలపై కాకుండా అభివృద్ధి పై దృష్టి పెడతారని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. అందుకే వన్ నేషన్..వన్ ఎలక్షన్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక కమిటీని నియమించింది..
ఇది కూడా చదవండి:- అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?
మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చైర్మన్ గా ఆయన ఆధ్వర్యంలో న్యాయ కమిటీని ఏర్పాటు చేసి వన్ నేషన్..వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన న్యాయ కమిషన్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలను నిర్వహించడం సాధ్యంకాదని తెల్చేసింది. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే గ్రామీణ స్థాయి నుంచి దర్యాప్తు ఉండాలని గ్రౌండ్ వర్క్ చాలా అవసరమని న్యాయ శాఖ కమిషన అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్థి వెల్లడించారు.
2024లో ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యంకాదని లా కమిషన్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. జమిలి నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్థి వెల్లడించారు. పూర్తి నివేదికకు కొంత సమయం అవసరమన్నారు. ప్రస్తుతం నివేదిక తయారీ ప్రక్రియ జరుగుతోందన్నారు.
ఇది కూడా చదవండి:- నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’
మరోవైపు, జమిలి నిర్వహణకు రాజ్యాంగపరమైన సవరణలు చేయాలని లా కమిషన్ తన నివేదికలో సూచించనుందని ఆ వర్గాల సమాచారం. జమిలి ఎన్నికల నిర్వహణపై 2022 డిసెంబర్ 22న లా కమిషన్ ఆరు ప్రశ్నలను జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణుల ముందు ఉంచింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుపుతున్న లా కమిషన్, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు తమ నివేదకను పబ్లిష్ చేయనుందని, కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సమర్పించనుందని వార్తలు వస్తున్నాయి.
లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, అడ్మినిస్ట్రేషన్ పైన, భద్రతాదళాల పైన భారం తగ్గుతుందని, ప్రభుత్వ పథకాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలవుతుందని కేంద్రం పేర్కొంది.
ఇది కూడా చదవండి:-;ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క
కాగా లా కమిషన్ నివేదిక ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2024 లో జమిలి ఎన్నికల నిర్వహణ అసలే సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా గడువు ప్రకారం జరిగే అవకాశం ఉంది.