Telugu News

లింగరంతండా దేవాలయ నిర్మాణానికి కందాళ చేయూత

గ్రామస్థులకు రూ.2.50లక్షలను అందజేసిన ఎమ్మెల్యే

0

లింగరంతండా దేవాలయ నిర్మాణానికి కందాళ చేయూత
== గ్రామస్థులకు రూ.2.50లక్షలను అందజేసిన ఎమ్మెల్యే
== ధన్యవాదాలు తెలిపిన గిరిజనులు
(కూసుమంచి-విజయంన్యూస్)
అడగంగానే కాదనకుండా చేయూతనందించే పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కూసుమంచి మండలంలోని లింగరంతండా గ్రామపంచాయతీలో దేవాలయ నిర్మాణానికి అర్థిక చేయూతనందించారు. గ్రామంలో నూతనంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం చేయాలని గిరిజనులందరు తలంచారు. కాగా ఈ నిర్మాణం కోసం భారీగా ఖర్చు అవుతున్న తరుణంలో గ్రామస్థులు, గిరిజనులు సర్పంచ్ బానోతు నాగేశ్వరరావు తో కలిసి ఇటీవలే పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసి సమస్యను తెలియజేశారు. దీంతో దేవాలయ నిర్మాణానికి సహాయం చేస్తానని హామినిచ్చిన కందాళ ఉపేందర్ రెడ్డి శనివారం పాలేరు ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయంలో లింగరంతండా గ్రామ పంచాయతీ ప్రజలందరి సమక్షంలో రూ.2.50లక్షల నగదను అందజేశారు. దేవాలయం నిర్మాణం అందరి సమక్షంలో మంచిగా చేసుకోవాలని, అందర్ని కలుపుకుని మంచిగా నిర్మాణం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి లింగరంతండా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. మీ ప్రతి అడుగులో మా గ్రామ ప్రజలు వెన్నంటే ఉంటామని హామినిచ్చారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బానోతు నాగేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, వార్డు సభ్యుడు వడ్త్యా బాలకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు వడ్త్యా కిషన్, గ్రామ శాఖ కార్యదర్శి,వడ్త్యా రామూర్తి, వడ్త్యాశ్రీను నాయక్, నాయకులు వడ్త్యా శేషుగిరి, వడ్త్యా శంకర్, వడ్త్యా బాసు, వడ్త్యా శ్రీను,వడ్త్యా మత్రు, వడ్త్యా మాల్సుర్, వడ్త్యా శంకర్, బానోత్ సోమ్లా, బానోత్ వీరబాబు, గ్రామపంచాయతీ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు