Telugu News

లింగారంతండా హైవే కనెక్టివిటీ రోడ్డు మరుమ్మత్తులు

ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చొరవతో పనులు వేగవంతం

0

లింగారంతండా హైవే కనెక్టివిటీ రోడ్డు మరుమ్మత్తులు

== ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చొరవతో పనులు వేగవంతం

== ధన్యవాదాలు తెలిపిన తండా వాసులు

(కూసుమంచి-విజయంన్యూస్)

లింగారంతండ హైవే కనెక్టివిటీ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవలే రోడ్డు విషయంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ బానోతు నాగేశ్వరరావు, నాయకులు వడ్తియా బాలు, రామూర్తి నాయక్ మరికొంత మంది గిరిజనులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసి రోడ్డు చర్చించారు.

ఇది కూడా చదవండి:- కందాళతుమ్మల.. దమ్ముంటే నా మీద పోటీ చేయ్:కందాళ

దీంతో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తానని హామినిచ్చిన ఎమ్మెల్యే అనుకున్నట్లుగా అతి కొద్ది రోజుల్లోనే సంబంధిత రైతు వడ్తియా వీర్య తో మాట్లాడి నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో గ్రామ సర్పంచ్ బానోత్ నాగేశ్వరావు, వార్డు సభ్యుడు బాలకృష్ణ, గ్రామశాఖ అధ్యక్షుడు రామ్మూర్తి నాయక్ , గ్రామ పెద్దలు ఎమ్మెల్యే కందాళ  ఉపేందర్ రెడ్డికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

ఇది కూడా చదవండి:- నీళ్లు అడిగితే ‘ఉచ్చ’ పోసుకోమన్నోళ్లు కావాలా..?: కందాళ