Telugu News

‘పాలేరు’లో మద్యం దందా..?

నచ్చిన మందు కావాలంటే బెల్ట్ షాపులకి పోవాల్సిందే

0

‘పాలేరు’లో మద్యం దందా..?

== వైన్స్ షాపుల్లో నో స్టాక్.. బెల్ట్ షాపుల్లో పుల్ స్టాక్

== నచ్చిన మందు కావాలంటే బెల్ట్ షాపులకి పోవాల్సిందే

== అధిక ధరలకు విక్రయాలు

== రూ.15 నుంచి రూ.20 అధనంగా వసూళ్లు చేస్తున్న మద్యం దుకాణదారులు

== వీధివీధిన బెల్ట్ షాపులు

== వైన్స్ షాపులున్నఊళ్లో పదికి పైగా బెల్ట్ షాపులు దర్శనం

==  తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలంలో ఆప్కారి పోలీసుల నిఘా సంగతేంటి..?

==  అనధికారికంగా అధికారులే బెల్ట్ షాపుల ప్రోత్సాహం.

== విచ్చలవిడిగా మద్యం విక్రయాలపై ప్రజాప్రతినిధుల ఫైర్

ఇదికూడా చదవండి: ‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలోని  తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లో మద్యం అక్రమ వ్యాపారం మూడు బీర్లు.. ఆరు కోటర్లు అన్న చందాగా సాగుతోంది. ప్రజలకు ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని విక్రయించేందుకు, ప్రజలందరికి వైన్స్ అందుబాటులో ఉండేందుకు గాను నియోజకవర్గాళ్లోని పలు మండలంలోని పలు గ్రామాల్లో మద్యం దుకాణాలను మంజూరు చేయగా,  వైన్స్ యజమానులు మాత్రం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మద్యంను అక్రమంగా  బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. తాగేందుకు కావాల్సిన మందు  వైన్స్ లో లేకుండా చేసి, అక్కడ నోస్టాక్ అంటూ చేతులు దులుపుకునే వైన్స్ యజమానులు, అదే మందును బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారు. అత్యధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారు.. అందినకాడికి దుంకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు.. ఇంత జరుగుతున్నప్పటికి నివారించాల్సిన అధికారులు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రతి ఏడాది ఇదే తంతు కనిపిస్తున్నప్పటికి నామమాత్రపు తనిఖీలు కూడా కనిపించడం లేదు.. ఇష్టానుసారంగా వ్యాపారులతో అధికారులు, ఉద్యోగులు కుమ్మక్కైయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ అంశంపై స్వయంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది.

ఇదికూడా చదవండి: సరిలేరు పొంగులేటికెవ్వరు.!

తిరుమలాయపాలెం మండల పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకున్నారు. బెల్ట్ షాపుల సంగతేంటని సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన పరిస్థితి తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది.

==  అడుగడుగు బెల్ట్ షాపులే

తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయించే విషయం టెండర్లు ఇచ్చే సమయంలోనే ప్రభుత్వం  స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎంఆర్పీధరలకు మద్యం ధరలను విక్రయించాలి, సకాలంలో మద్యం ధరలను మూసివేయాలి, ఉదయం 10గంటల నిం రాత్రి 9గంటల వరకు వైన్స్ షాపులను తెరిచి ఉంచే విధంగా, ఆ తరువాత కచ్చితంగా మూసి వేయాలని ఆదేశించింది. అంతే కాకుండా మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం విక్రయించరావోద్దని తెల్చిచెప్పింది..  కానీ అటు అధికారులను, ఇటుప్రజలను వైన్స్ యజమానులు తప్పుదోవ పట్టిస్తున్నారు. అర్థరాత్రుల పాటు వైన్స్ విక్రయాలు చేయడంతో పాటు బెల్ట్ షాపులను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులే ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపులకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కానీ ఊరు నిండా ఎక్కడ చూసిన బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. కిరాణం దుకాణంలో, హోటళ్లలో, రోడ్డు వారిగా ఏర్పాటు చేసిన హోటళ్లలో, చిన్నచిన్న బడ్డికోట్లలో, నివాస కుటుంబాలు ఉండే స్థలాల్లో, పవిత్రమైన ఆలయాల వద్ద, పాఠశాలల వద్ద, ఎదురుగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. దీంతో యువత పెడదోవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

== రూ.20 అధనంగా వసూళ్లు                                          ఇది కూడా చదవండి: తెలంగాణ దేశానికే మోడల్: మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం మద్యం పాలసీలో భాగంగా ఇతరులకు ఎవరికి అమ్మిన వైన్స్ పై ఎంఆర్పీ ధరలకు మాత్రమే అమ్మాలని ఆదేశించింది. దీంతో దుకాణయజమానులు ఎంఆర్ఎఫ్ కి తగిన ధరలకు విక్రయాలు చేయాల్సి ఉంటుంది. కానీ గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో పుట్టగొడుగుళ్లా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసిన బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్రతి మందు బాటిల్ ను బెల్ట్ షాపులకు ఎంఆర్పీ కాకుండా  అధిక ధరలకు విక్రయాస్తున్నారు. వైన్స్ షాపుల వద్ద కావాల్సిన మందుకు ఎంఆర్పీ ధరలకు విక్రయిస్తున్న వైన్స్ దుకాణదారులు, అదే వైన్స్ నుంచి బెల్ట్ షాపులకు పంపించే మందుకు మాత్రం రూ.15 నుంచి రూ.20 రూపాయలను అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేవలం మనం రూ.15 మాత్రమే అనుకుంటాం. కానీ ఒక్కోక్క బాటిల్  నెలకు రూ.15 నుంచి రూ.20 వసూళ్లు చేస్తే కోట్ల రూపాయల ఆధాయం లభించే అవకాశం ఉంది. దీంతో వైన్స్ యజమానులు కావాలనే బెల్ట్ షాపులను గ్రామాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఇదేందని అడిగే నాథుడే కరువైయ్యారు. దీంతో వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోయాయి.

==  ప్రజలకంటే మద్యం అమ్మకాలే ప్రాధాన్యత.

వినియోగదారుడు ఏమైతే ఏంటి, తమ మామూళ్ళతో తమకు కిక్కు ఎక్కుతుందని ఆలోచన ధ్యేయంగా  అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సామాన్యుని జేబు చిల్లు పడటం ద్వారా అధికారులకు ప్రభుత్వానికి వస్తున్న తలంపుపై ఎవరికి పట్టింపు లేదనేది ప్రధాన వాదన ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇదే ప్రధాన కోరిక తిరుమలాయపాలెం మండల పరిధిలో నడిపిస్తున్న బెల్టు దుకాణాల యజమానుల తీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మద్యం వ్యాపారులు వ్యూహాత్మకంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులను కొనసాగిస్తూ వేల రూపాయలు గడిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి లైసెన్స్ పొందిన వ్యాపారులు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నప్పటికీ బెల్ట్ షాపుల వ్యాపారం మూడు పువ్వుల ఆరు కాయలుగా సాగిస్తున్నారు.

== అరికట్టాల్సిన అధికారులే అతుక్కుపోతున్నారని విమర్శలు     

తిరుమలాయపాలెం మండల పరిధిలోని గ్రామాలలో సుమారుగా 700 పైగా, నేలకొండపల్లి మండలంలో 80కిపైగా, ఖమ్మం రూరల్ మండలంలో 50కిపైగా  బెల్ట్ దుకాణాల్లో మద్యం ఏరులై పారుతుంది. పచ్చటి సంసారాల్లో బెల్టు దుకాణాల అమ్మకాలు నిప్పులు పోస్తున్నాయి. విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతున్న ఇటు ఆప్కారి పోలీసులు గాని, సివిల్ పోలీసులు గాని పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. బెల్ట్ షాపులను పట్టించుకోవాల్సిన యంత్రాంగం కేవలం మామూలకే పరిమితమయ్యాయరని,  దీంతో బెల్ట్ షాపులు రోజుకొకటి  చొప్పున పుట్టగొడుగుల వెలుస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

==  రోజువారి కూలీల టార్గెట్                          ఇదికూడా చదవండి:  జార్ఖండ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.

కూలి పనికి పోతే గాని పూట గడవని, సామాన్యులకు టార్గెట్ గా బెల్ట్ షాప్ దుకాణాల దందా కొనసాగుతుంది

బెల్ట్ షాపుల వల్ల సామాన్యులు  ఆర్థికంగా నష్టపోయి వారి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు రోజంతా కష్టపడితే వచ్చిన డబ్బులతో సగానికి పైకి మద్యానికి ఖర్చు పెడుతున్నారు. ఉదయం నుంచి బెల్ట్ షాపులు తెరిచి ఉండడంతో కూలికి వెళ్లే వేళలోనే మద్యం సేవిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా..? బెల్ట్ షాపులకు, వాటిని విక్రయించేందుకు బెల్ట్ షాపులకు ధరలు పెంచి విక్రయిస్తున్నారా ..? చూడాల్సి ఉంది.