తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరి కొత్త రికార్డు..
తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా సాగుతున్నాయి… డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డులు సృష్టించాయి…
డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు డిపోల నుండి జరిగిన మద్యం అమ్మకాలు విలువ రూ.3,459 కోట్లుగా ఉంది.. గత ఏడాది అంటే 2020 డిసెంబర్లో మద్యం అమ్మకాల విలువ రూ.2,764 కోట్ల 78 లక్షలుగా ఉండగా… 2021లో సరికొత్త రికార్డు సృష్టించాయి.. 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఈ 2021 డిసెంబర్లో సుమారు 700 కోట్ల మద్యం అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి..
ఇక, డిసెంబర్లో 40.48 లక్షల కేసుల లిక్కర్, 34 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది.. మరోవైపు… డిసెంబర్ 31వ తేదీన మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.. 171.93 కోట్ల లిక్కర్ సేల్ చేశారు..
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి.. ఇక, ఇవాళ కూడా జోరుగా మద్యం అమ్మకాలు సాగుతాయని అంచనా వేస్తున్నారు.
also read :-ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసిన టీఎన్జీవోస్ కార్యవర్గం