Telugu News

లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్‌

తెలంగాణవిజయం న్యూస్

0

లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్‌.

(తెలంగాణవిజయం న్యూస్):-

తెలంగాణ ఏర్పాటు పైన ప్రధాని మోదీ వ్యాఖ్యల విషయంలో టి.ఆర్.ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో టి.ఆర్.ఎస్ ఎంపీలు లోక్​సభలో నిరసనకు దిగారు.

స్పీకర్‌ పోడియం వద్ద ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

also read :-నూతన వదువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కందాళ

అంతకుముందు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ప్రధానిపై చర్యలు తీసుకోవాలని తెరాస ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసులు అందజేశారు.

ఏపీ విభజన బిల్లు ఆమోదంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు అభ్యంతరం తెలిపారు.

ప్రివిలేజ్‌ నోటీసుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

స్పీకర్‌ నిర్ణయం తీసుకునే వరకు సభ బహిష్కరణకు తెరాస నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్‌ చేశారు.