Telugu News

ముందస్తు పై ఊహాగానాలు……

==ఏజెన్సీ ప్రాంతంలో అప్పుడే మొదలైన సీట్ల లొల్లి.......

0

ముందస్తు పై ఊహాగానాలు……
==ఏజెన్సీ ప్రాంతంలో అప్పుడే మొదలైన సీట్ల లొల్లి…….

==పట్టు సడలకుండా అధికారపక్షం……
==పట్టుకోసం ప్రతిపక్షాలు…..
==జిల్లా అధ్యక్షుడు పై తీవ్ర ప్రభావం…..
(చండ్రుగొండ -విజయం న్యూస్ ):-

ఏజెన్సీ ప్రాంతంలో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి.. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలను పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రధాన పార్టీలు చెమటోడుస్తున్ననాయి… గతంలో 2019 లో జరిగిన మాదిరిగానే ప్రస్తుత పర్యాయం సైతం ముందుస్తు ఎన్నికలు రావచ్చన్న ఊహాగానాలు రాజకీయ పార్టీలు వినిపిస్తున్నాయి…. అప్పటికి ఇప్పటికి మారిన పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తమ స్పీడ్ ను పెంచుకుంటూ ప్రత్యర్ధులకు సవాల్ విసురుతున్నాయి…..

also read;-మహిళా బంధు కేసీఆర్..మహిళల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలు..
ముందస్తు పెరుగుతున్న ఊహాగానాలు……
గత కొన్ని నెలల నుంచి జిల్లాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న సమీకరణాలు, జరుగుతున్న మార్పులు ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న వ్యూహప్రతివ్యూహాలు పరిశీలిస్తున్న పలువురు నేతలు ముందస్తు ఎన్నికలు రావచ్చని వ్యక్తమవుతున్నాయి…. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సభలో కెసిఆర్ చేస్తున్న ప్రసంగాలు, ముందస్తు కి ఆజ్యం పోతున్నట్టుంది…
ఏజెన్సీ ప్రాంతంలో అప్పుడే మొదలైన సీట్ల లొల్లి……
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం అధికమంది ఆశావాహులు ఉండడంతో పార్టీకి తలనొప్పిగా మారింది… అయితే ఆశావాహులు తమతమ సెగ్మెంట్లో పై తమ పట్టును మరింత పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు… ప్రధాన రాజకీయ పక్షాలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, పాటు వామ పక్షాల పార్టీలు సైతం ఆశావహుల సంఖ్య పెరిగిపోతుంది….
ప్రధానంగా అధికార టిఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, గతంలో ఓటమి చెందిన అభ్యర్థులు సైతం టిఆర్ఎస్ లో ఉండటంవల్ల ఆ పార్టీకి తీవ్ర సమస్యగా మారిపోతుంది….. ఎవరికి వారు పార్టీకి సంబంధం లేకుండా తమ తమ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు….

also read;-రాజ్యాంగాన్ని అవమానిస్తున్న కేసీఆర్
దూకుడు పెంచిన అధికారపక్షం…..
జిల్లాలో అధికార టీఆర్ఎస్ తన దూకుడును మరింత పెంచింది… ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని, టిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తోంది… దీంతో రంగంలోకి దిగిన గులాబీ నేతలు ప్రజల్లోకి మరింతగా వెళుతున్నారు.. ఇటీవల కాలంలో జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేగా కాంతారావు ఇప్పటికే పలు నియోజకవర్గాలపై దృష్టిసారించారు… ప్రతి నియోజకవర్గ స్థాయి నేతలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఐదు కి ఐదు స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు… కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు… ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే నాయకులు ఎక్కువ ఉండటం వల్ల టిక్కెట్ రాని నాయకులు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఎక్కువ ఉండడంతో జిల్లా అధ్యక్షుడు పై ఎl తీవ్రస్థాయిలో ప్రభావం ఉంటుందనే తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి…
పూర్వవైభవం కోసం కాంగ్రెస్…..
గత అసెంబ్లీ ఎలక్షన్ లో జిల్లాలో ఉన్న ఐదు స్థానాలను ఐదు స్థానాలను పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది… సప్త గతంగా ఎంతో పటిష్టమైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొంతకాలం డీలా పడ్డ పిసిసి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య లాంటి నేతలు నిత్యం ప్రజల్లో ఉండి ఈ ఐదు స్థానాలపై గురి పెట్టారు… ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం, పధకాలలో అక్రమాలు, అవినీతిపై విమర్శలు, నిరసనలు చేయడం చేస్తున్నారు.. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తో, గడపగడపకు, వెళ్లడం ప్రజా సమస్యలు వాళ్లకి తెలియజేయటం, డిజిటల్ సభ్యత్వ నమోదు చేసి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ పార్టీని పటిష్ట పరుస్తూ ఉన్నారు…
ఎన్నికలు ఎప్పుడు జరిగేది స్పష్టంగా తెలియకపోయినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఎక్కడికి వెళ్ళినా ముందస్తు ముచ్చట్లే వినిపిస్తున్నాయి….

 

please subscribe this chanel smiling chaithu;-