Telugu News

ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితంపై జోరుగా బెట్టింగ్స్.?

నిఘా పెట్టిన పోలీసులు

0

ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితంపై జోరుగా బెట్టింగ్స్..?

— నిఘా పెట్టిన పోలీసులు

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్)

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేలకొంది.. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఎన్నికలు జరిగాయి.. నువ్వా-నేనా..? అన్నట్లు పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కచ్చితంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుండంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లపై హైప్ మరింత పెరిగింది. ప్రజలు ఎన్నికల ఫలితాల వైపు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..

ఒక ఖమ్మం జిల్లా ప్రజలే కాదు.. యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితం వైపు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో బెట్టింగ్ రాయుళ్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. .మంగళవారం జరిగే లెక్కింపులో ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటూ..? ముమ్మరంగా బెట్టింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం కేంద్రంగా, హైదరాబాద్ సబ్ కేంద్రంగా బెట్టింగ్ జోరుగా జరిగినట్లు సమాచారం. అయితే ఎక్కువగా కాంగ్రెస్ గెలుస్తుందని లక్షల లక్షల బెట్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు టీఆర్ఎస్ గెలుస్తుందని బెట్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఎదైతేమి ఖమ్మం ఏకగ్రీవం అవుతాయని భావించిన ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు బెట్టింగ్ వైపు తీసుకొచ్చిందంటే ఎంత క్రాస్ ఓటింగ్ పడిందో అర్థమవుతుంది..? చూద్దాం .. ఫలితాల్లో గెలుపు ఎవరిదో..?

 

also read :-** అందరి చూపు ఖమ్మం వైపు.