Telugu News

జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

0

జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఖమ్మం 2 మరియు 3 వ డివిజన్లో ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ రెండో డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఎం వెంకటేశ్వర్లు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా నగర అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ రక్షణ నిమిత్తం నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు నెరవేర్చలేక ప్రభుత్వ ఆస్తులను ప్రజలకు చెందాల్సినటువంటి హక్కుల నీటిని వారి వారి అను నయకులకు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి భారతదేశ ఆర్థిక స్థితిని బ్రష్టు పట్టిస్తున్నారు ఏం ఆలోచించి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చాము స్వాతంత్ర ఫలాలు బడుగు బలహీన మైనార్టీ వర్గాలు అన్నిటికీ సమాన స్థాయిలో పంచడానికి చేసినటువంటి స్వాతంత్రోద్యమానికి తూట్లు పొడుస్తూ నేడు భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోంది

also read :-ఆటో డ్రైవర్ నిజాయితీని అభినందించిన ట్రాఫిక్ సీఐ అంజలి .

ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చి అధికార దుర్వినియోగ నికి పాల్పడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాల పేరిట ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని లక్షల సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనకు రావాల్సిన హక్కులను పొందే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అధిక సంఖ్యలో డిజిటల్ సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా మరియు మన ప్రక్క వారందరిని సభ్యత్వ నమోదు చేసినట్టు గా ప్రోత్సహించాలని కోరుతున్నానన్నారు బూత్ స్థాయి ఎన్రోలర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు నిర్వహించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబ సభ్యునికి గుర్తింపు కార్డు తో పాటు రూ 2 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

also read;-ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్….!?

తెలంగాణలో నూతనోత్సాహంతో దూసుకుపోతున్న కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సాధించాల్సిన బాధ్యత ప్రతి బూత్ ఏజెంట్ కు ఉందని జాతీయ నాయకత్వం పిలుపు మేరకు సభ్యత్వ నమోదుకు అందర్నీ ప్రోత్సహించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రూపొందించన నూతన సభ్యత్వ నమోదు విధానాన్ని బూత్ స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునే వాళ్ల వివరాలన్నీ, ఏఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో పొందుపరుస్తారు. పార్టీ సభ్యుల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు అందులో ఉంటాయి. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపనిచ్చే కార్యక్రమాల వివరాలు యాప్ ద్వారా పార్టీ సభ్యులకు నేరుగా అందుతాయి. అన్నారు. ఈ కార్యక్రమంలో రెండో డివిజన్ అధ్యక్షులు రాంబాబు మూడో డివిజన్ అధ్యక్షులు చిన్న నాగేశ్వరావు నాయకులు కాలవ నర్సిం హా రావు ఎం నాగేశ్వరరావు గోపి మాజీ జెడ్పిటిసి హైమావతి తదితర నాయకులు అందరూ పాల్గొన్నారు ఒక బూతు లోని కొంత మంది కార్యకర్తలుకు సభ్యత్వ నమోదు చేశారు