Telugu News

ఇల్లందులో కింగ్ మేకర్ ‘మడత’

ఎంట్రీపై ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు

0

కింగ్ మేకర్ ‘మడత’
== ఆయనపై పలు పార్టీ నేతలు గురి
== నజర్ ప్రకటిస్తున్న వివిధ పార్టీలు
== మూడు సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా మడత
== త్వరలో రాజకీయాలకు రీ ఎంట్రీ
== ఇల్లెందు నియోజకవర్గంలో కీలకం కానున్న మాస్ లీడర్
== ఎంట్రీపై ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు
(తమ్మిశెట్టి,ఇల్లెందు-విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నియోజకవర్గంలో ఒక్కటి ఇల్లందు.. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంధిగా మారింది.. అలాంటి నియోజకవర్గంలో కీలక నాయకుడైన మడత వెంకటేశ్వర్లు..ప్రస్తుత రాజకీయాలకు కింగ్ మేకర్ గా మారిండనే చెప్పాలి.. ఆయన ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితి ఉంది.. ఆయన పేరు వినగానే మందు గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికి ఆయన మారుతున్న రాజకీయ పెనుమార్పుల్లో గులాబీ గూటిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఇది కూడా చదవండి: భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ : మంత్రి 

అనుకోని పరిణామాలతో ఆయన రాజకీయాలకు దూరమైయ్యాడు.. గులాబీ పార్టీలో ఊహించిన ప్రీయార్టీ లేకపోవడం. పార్టీ ఓటమికి కారణమైన వారికి బాధ్యతలను అప్పగిస్తుండటంతో ఆయన స్తబ్దతగా ఉండాల్సి వచ్చింది.. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో రాజకీయం మరింత హీట్ రేపుతున్న క్రమంలో ఇల్లందు నియోజకవర్గంలో మడత వెంకట్ గౌడ్ కీలకమైయ్యారనే చెప్పాలి.. ఆయన ఎటువైపు రాజకీయం చేస్తే అటు విజయం తథ్యమనే ప్రచారం ఉంది.. అందుకే అన్ని పార్టీల చూపు ఆయన వైపే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.. పలు పార్టీల ఆగ్రనాయకులు ఆయన్ను సంప్రదిస్తున్నట్లు సమాచారం.. ఆయన ఎంతో కీలకం కానున్న నేపథ్యంలో ‘విజయం ప్రతినిధి’ అందించే ప్రత్యేక కథనం                                    ఇది కూడా చదవండి: అందరి చూపు ఆయన వైపే

ఇల్లెందులో ఆయా పార్టీలకు ప్రాతినిథ్యం వహించిన మడత వెంకట్ గౌడ్, రెండు దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఐదు సంవత్సరాల పాటు వైస్ చైర్మన్ గా, ఐదు సంవత్సరాలు తన సతీమణి చైర్మన గా పనిచేశారు. రాజకీయాల్లో చక్రం తిప్పింది మడతనే రాజకీయాలకు మూడు సంవత్సరాల దూరంగా ఉన్నా ఇప్పటికి ప్రజల్లోనే అందుబాటులో ఉంటున్నాడు. వ్యక్తిగత అవసరాలకు చిన్న సమస్య వచ్చినా తన నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ విషయంపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. లోకల్ లో ఉండకపోయినా ప్రజలకు ఫోన్లు అందుబాటులో ఉండటం పట్ల ప్రజల ఆశిస్తున్నారు.
== పలు పార్టీల గురి?
మడత వెంకట్ గౌడ్ గా స్తబ్దతగా ఉంటున్నాడని తెలిసి పలు పార్టీలు ఆయనపై నజర్ ప్రకటించాయి అయినప్పటికీ మడత మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కీలక పరిణామం తీసుకోవాలని ఉద్దేశంతోనే మూడు సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా వస్తూ ఉన్నాడు. కీలక సమయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సమయుక్తమవుతున్నాడు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఆయనకు టచ్ లో ఉన్నప్పటికీ త్వరలో ప్రకటిస్తానని తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్తున్నాడు.
== గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకపాత్ర?                            ఇది కూడా చదవండి:- మేమే నెంబర్ వన్: సీఎం కేసీఆర్
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మడత వెంకట్ గౌడ్ కీలకపాత్ర పోషించారు బాలసాని లక్ష్మీనారాయణ గెలుపులో వెంకట్ గౌడ్ పాత్ర వెలకట్టలేని ఇల్లెందు మున్సిపాలిటీలో 19 మంది కౌన్సిలర్లు ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు స్థానిక ప్రజాప్రతిని కూడ కొట్టడంలో సఫలీకృతుడయ్యాడు ఏకంగా వివిధ పార్టీలను జమ చేసి 42 మందిని ఏకం చేసి గెలుపులో కీలక పాత్ర పూజించాడు గతంలో ఈ విషయంపై మడతపట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసల జల్లు కురిపించాడు.
_ == ఎమ్మెల్సీ ఇస్తారని హామీ?
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినందుకు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఇస్తామని నాడు కెసిఆర్ చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ హోదా ఇస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బీసీ సామాజిక నేత మడతకు ఎమ్మెల్సీ వస్తుందని ఆశించారు. అయినప్పటికీ రాష్ట్ర క్యాబినెట్ హోదా వస్తుందని అభిమానులు అంచనా వేశారు. అలాంటిది పార్టీ గుర్తించకపోవడంతో నిరాశలో ఉన్న మడత, తదనంతరం పరిణామాలపై ఆలోచనలో ఉన్నాడు.
== భారీగా అభివృద్ధి?                                                    ఇది కూడాచదవండి:- కూసుమంచిలో ‘జన’జాతర
మడత వెంకట్ గౌడ్ ఐదేళ్లపాటు మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ఈ సమయంలో సుమారు రూ.120 కోట్లు నిధులు తీసుకొచ్చారు. ఇల్లెందును ఏకం చేసే విధంగా నిధులు రాబట్టారు. మినీ ట్యాంక్ బండ్ సెంట్రల్ లైటింగ్ వార్డులో సిసి రోడ్లు మోడల్ మార్కెట్ తదితరులని తమ చేతితోనే శంకుస్థాపన చేశారు. ఈరోజు ఇవన్నీ చివరి దశకు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ దశాబ్ద కాలంగా మడత రాజకీయ అభివృద్ధిని తీసుకొచ్చాడు.
==_224 జీవో ఆయన ఘనత?
ఇల్లెందు పట్టణానికి 244 తీసుకొచ్చిన ఘనత మడత కె దక్కింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 224 జీవో తీసుకొచ్చి ఇల్లందు పట్టణానికి ఊపిరి పోశారు. అప్పటివరకు క్రమబద్ధీకరణకు నోచుకుని ఇల్లందు పట్టణం మడత హయాంలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసింది. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సైతం క్రమబద్ధీకరణకు పాటుపడ్డాడు.
_== రాజకీయ హోదా ఇచ్చింది పలు పార్టీలు సిద్ధం?                      ఇది కూడా చదవండి:-  ‘ఖమ్మం’ పై నేతల పోకస్
గతంలో పొరపాటు జరగనివ్వమని కాంగ్రెస్ బిజెపి పార్టీలు నేతలు టచ్ లో ఉన్నారు అయినప్పటికీ మడత నోరు ఇప్పట్లేదు ఏది ఏమైనప్పటికీ తన అనుచరులతో సమావేశమయ్యే నిర్ణయం తీసుకుంటానని ఇప్పటికే చెప్పాడు ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున జన సమీకరణతో మీటింగ్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మడతకు ఇల్లందు పట్టణంతోపాటు మండలంలో మంచి క్రేజ్ ఉంది అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులతో సత్సంగం కొనసాగుతున్నాయి కెసిఆర్ సభ తర్వాత మడత నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి