రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మద్ది శ్రీనివాస్ రెడ్డి
మాణిక్యరావ్ టాక్రేను సన్మానించిన అధికారప్రతినిధి
రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మద్ది శ్రీనివాస్ రెడ్డి
== మాణిక్యరావ్ టాక్రేను సన్మానించిన అధికారప్రతినిధి
(కూసుమంచి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారప్రతినిధిగా రెండవసారి ఎంపికైన డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి శనివారం జూబ్లీహిల్స్ లోని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకముంచి అధికార ప్రతినిధి పదవిని అందించినందుకు సర్వదా రుణపడి ఉంటానని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న పరిణామల గురించి, రేవంత్ రెడ్డి కి వివరించారు.అనంతరం రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అలాగే గాంధీభవన్ కు వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యరావు ఠాక్రే ను మద్ది శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే వరకు విరామం లేకుండా పోరాటం చేయాలని, ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిళ దారేటు..? నేతల రూటేటు..?