కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మద్ది శ్రీనివాసరెడ్డి నియామకం
అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మద్ది శ్రీనివాసరెడ్డి నియామకం
== రెండువ సారి ఏకగ్రీవంగా ఎన్నిక
== అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు
(ఖమ్మం-విజయంన్యూస్)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఖమ్మం రూరల్ మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, పాలేరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, ప్రముఖ న్యాయవాది, ఉన్నత విద్యావంతుడు, అంబేద్కర్ వాది, డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డిని మరల నియమిస్తూ, ఆ మేరకు నియామక ఉత్తర్వులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జారిచేసారు. మద్ది తన 8వ తరగతి నుంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకుడిగా, 1997లో ఖమ్మం రూరల్ మండల ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ మలిదశ ఉద్యమాలలో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి., ఎల్. ఎల్. ఎం (గోల్డ్ మెడలిస్ట్), పీహెచ్డీ పూర్తి చేశారు.
allso read- కాంగ్రెస్ వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ:సంభాని
చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారు. తన తాత పటేల్ వీరారెడ్డి నుంచి నేటి వరకు ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో నే కొనసాగుతున్నారు. పాఠశాల విద్యార్థి దశ నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2009 & 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కీర్తిశేషులు రాంరెడ్డి వెంకటరెడ్డి గారి వెంట ఉండి, ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. 2010లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లీగల్ మరియు మానవ హక్కుల విభాగం జిల్లా కన్వీనర్ గా దాదాపు 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్రీ గా కేసులు చేశారు, ఇప్పటికి పార్టీ తరపున కేసులు చేస్తూనే ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చినా, తన వంతుగా లీగల్ గా, ఆర్ధికంగా సహకరిస్తున్నారు, నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా, సైనికుడిగా పనిచేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2021లో ఖమ్మం-నల్గొండ -వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిక్కెట్ కోసం రాష్ట్ర అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం మద్ది శ్రీనివాస రెడ్డి పేరును బలంగా పరిశీలించినప్పటికి, కొన్ని సమీకరణాల వల్ల టికెట్ రాకపోయినా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ , యువ నాయకులు రాహుల్ గాంధీ, పిసిసి అధిష్టానం, మద్ది ని గుర్తించి ఆనాడు, రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమించడం జరిగింది.
allso read- ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి
మద్ది మాట్లాడుతూ, తన మీద ఎంతో నమ్మకంతో మరల ఈ బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు రేణుకా చౌదరికి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్కకి, టీపీసీసీ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకి, జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకి, కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోవు 2023 ఎన్నికలలో పాలేరు నియోజకవర్గంతో పాటు, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.. మద్ది నియామకం పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.