Telugu News

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయడమేంటీ..? : కేకేడీ

* ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య

0

*ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయడమేంటీ..? : కేకేడీ

* ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య

*కళాకారుల గొంతునొక్కేందుకు అధికారపార్టీ ప్రయత్నం….*
*మఠంపల్లిలో ఏపూరి సోమన్నపై దాడిని ఖండించిన కిషోర్ కుమార్ దొంతమాల…*
ఖమ్మం ప్రతినిధి జులై 6(విజయం న్యూస్ ):-
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం హుజూర్ నగర్ నియజకవర్గం మఠంపల్లిలో చేపట్టిన నిరుద్యోగ దీక్షలో కళాకారుడు ఏపూరి సోమన్నపై జరిగిన దాడిని ఆ పార్టీ మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ కిషోర్ కుమార్ దొంతమాల(KKD) తీవ్రంగా ఖండించారు.దళితుడు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సోమన్న పై టీఆర్ఎస్ నాయకులు దాడిచేయటం సిగ్గుచేటన్నారు.

Allso read:- ఇదేక్కడి న్యాయం..?  కాంగ్రెస్ కార్పోరేటర్ల ఆగ్రహం

తప్పులు చేసే నాయకులను విమర్శిస్తే దాడులు చేయటం పిరికిపందల చర్యగా అభివర్ణించారు.ప్రశ్నించే కవులు,కళాకారుల గొంతునొక్కేందుకు అధికారపార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.తమ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్రను చూసి తట్టుకోలేక అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.తమ పార్టీ నాయకుల జోలికొస్తే అధికారపార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Allso read:- ఫారెస్ట్ అధికారులు మాపై దాడి చేశారు : రైతులు