Telugu News

మధిర కు భట్టి విక్రమార్క పోటీ

0

మధిర కు భట్టి విక్రమార్క పోటీ
== నాల్గొవ సారి బరిలో నిలుస్తున్న సీఎల్పీనేత
== విజయం సాధిస్తే సీఎం అభ్యర్థే
== సంబరాల్లో మునిగిన మధిర నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. మొత్తం 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ విడుదల చేశారు. దీంతో మధిర నియోజవర్గం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కేటాయించగా, వరుసగా నాలుగోసారి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

ఇది కూడా చదవండి:- పిట్టలదొర మాటలు మానండి: భట్టి విక్రమార్క

ఇప్పటికే మూడుసార్లు వరుసగా విజయం సాధించి, హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాలుగోసారి విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గెలిపించేందుకు మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించిన భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.

ఇది కూడా చదవండి:- ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క

అయితే మొదటి జాబితాలో మధిర నియోజవర్గం నుంచి బట్టి విక్రమార్క కు సీట్ కేటాయించడంతో మధిర నియోజకవర్గ పార్టీ శ్రేణులు సంబరాలు చేస్తూ టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.