బీసీ నేతకు దళితబంధు ఎలా ఇస్తారు
◆◆ దళిత కుటుంబాలకు ఎమ్మెల్యే భట్టి తీవ్ర అన్యాయం*
◆◆ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు ఎమ్మెల్యే భట్టి తూట్లు*
◆◆ దళిత బంధు ను పక్కదారి పట్టిస్తున్న దళిత వ్యతిరేకి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క*
◆◆ నిజమైన అర్హులకు అన్యాయం చేస్తూ దళితల పట్ల ఎమ్మెల్యే భట్టి చిన్నచూపు*
మధిర, జులై16(విజరంన్యూస్):
మధిర టౌన్ లో తన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసీ వ్యక్తి కోరంపల్లి అంకమరావు(చంటి) దళిత బంధు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కి సిఫార్సు చేసిన ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వైఖరిపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భగ్గుమన్నారు.
Allso read:- శాంతిస్తున్న గోదావరి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా దళితులకు అండగా నిలబడి వారి కుటుంబాలను ఆర్దిక స్థితిగతులు మార్చాలని మంచి సంకల్పంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం అందిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచిన దళిత బంధు పథకాన్ని మధిర నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వింత చేష్టల తో పక్కదారి పడుతుంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కుటుంబాలకు దళిత బంధు అందించాలని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అధికారాలు ఇస్తే అది కాస్త మధిర నియోజకవర్గంలో రాష్ట్ర నాయకుడు అని చెప్పుకొనే కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పక్కదారి పట్టించి దళిత కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మధిర మండల TRS పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్.సి విభాగం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో తన అనుచరుడిగా తిరిగే నాయకులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నారని దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు భట్టి తూట్లు పొడుస్తున్నాడని ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే గా కొనసాగడానికి అనర్హుడన్నారు.
Allso read:- భద్రాద్రిపై గోదావరి దొంగదెబ్బ
ఎమ్మెల్యే గా నా చేతిలో అధికారం ఉందని దళితులకు అందించాల్సిన దళిత బంధు పథకాన్ని సైతం బీసీ కులానికి చెందిన వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ దళిత వ్యతిరేకి గా భట్టి తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే హోదా లో 26 యూనిట్ల కు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ లిస్టును జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సంతకం చేసి సిఫార్సు లేటర్ పంపించారు. ఎమ్మెల్యే భట్టి పంపిన ఈ జాబితాలో మధిర పట్టణంలోని బంజర కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భట్టి అనుచరుడు, బీసీ వ్యక్తి కోరంపల్లి అంకమరావు(చంటి) కి దళిత బంధు ఇవ్వాలని సూచించడం ఏంటని తెరాస నాయకులు ప్రశ్నించారు దళితులకు అందవల్సిన దళిత బంధు బీసీకి ఎలా కేటాయిస్తారని వారు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు ఆ లిస్టులో ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని దళిత బంధు నిజమైన అర్హులకు ఇవ్వాలని దళిత ప్రజల పక్షాన కోరుతున్నామని వారు పేర్కొన్నారు
Allso read:- జిల్లా యంత్రాంగం సేవలకు సెల్యూట్.. మంత్రి పువ్వాడ..
ఈ విలేకరుల సమావేశంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు, మండల నాయకులు మెండెం వెంకన్న, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మేడికొండ కిరణ్, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, తొగురు ఓంకార్, గద్దల రాజా, జిల్లేపల్లి బాబూరావు, మార్తా నరసింహారావు, కల్యాణం రమేష్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.