Telugu News

తెలంగాణ ప్రభుత్వం హాయంలోనే మధిర పట్టణాభివృద్ది

మధిర ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం ప్రారంభం చేసిన మంత్రి పువ్వాడ, సీఎల్పీనేత, ఎంపీ

0

తెలంగాణ ప్రభుత్వం హాయంలోనే మధిర పట్టణాభివృద్ది

== మధిర ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం ప్రారంభం చేసిన మంత్రి పువ్వాడ, సీఎల్పీనేత, ఎంపీ

== మండలంలో రూ.11.50కోట్ల బడ్జెట్ తో పలు అభివృద్ది పథకాలకు శంఖుస్థాపన ప్రారంభోత్సవం

(మధిర/ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాయాంలోనే మధిర పట్టణం అభివృద్ధి దిశగా పయనిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబోత్సవాలు, శంఖుస్థాపనలు చేసారు. మధిర మండలం ఖమ్మంపాడు గ్రామంలో రూ.42 లక్షల వ్యయంతో నిర్మించిన 5 వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పి.ఏ.సి.ఎస్ గోదాములను అదేవిధంగా రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన పరపతి సహకార సంఘం కార్యాలయ భవనం ప్రహరీని మంత్రి ప్రారంభించారు. అనంతరం మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రూ. 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్‌ను ప్రారంభించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

also read;-అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

మధిర పట్టణంలో గల ఊర చెరువును రూ.5 కోట్ల 70 లక్షలతో మిని ట్యాంక్ బండ్ గా ఆధునీకరించే పనులకు అదేవిధంగా రూ.4 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ పనులకు మంత్రి శంఖుస్థాపన చేసారు. అనంతరం మధిర పట్టణంలో రూ.కోటి 40 లక్షలతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఎం.ఎల్.ఏ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. పట్టణంలోని నిరుద్యోగ మహిళలకు మహిళా సాధికారత స్వయం ఉపాధి కింద 3 వందల మంది మహిళలకు కుట్టు మిషన్లను స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, డి.సి.సి. బి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం తరహాలో మధిర పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు అదేవిధంగా సమీకృత వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ ను పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని పట్టణంలో సి.సి రోడ్ల నిర్మాణం, ప్రధాన కూడళ్ళ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

also read;-సహాకార సంఘాల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది

త్వరలోనే వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానున్నదని ఇప్పటికే కోటి 40 లక్షలతో ఎం.ఎల్.ఏ క్యాంపు కార్యాలయంను ఏర్పాటు చేసుకున్నామని దీనితో పాటు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పట్టణంతో పాటు సమీప ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, వసతి అవకాశాలు కల్పించామని మంత్రి అన్నారు. సంక్షేమంలో భాగంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం ద్వారా జిల్లాలో ఘననీయమైన పంట దిగుబడి వస్తుందని రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గాను జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందిస్తూ ధాన్యం సేకరణ జరుగుతుందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

also read;-ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరభావము అవసరం – తాతా మధుసూదన్

నగరాలతో పాటు పట్టణాలను కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్ళు, సెంట్రల్ లైటింగ్, వాటర్ ఫౌంటేన్స్, మినిట్యాంక్ బండ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, రైతుబంధు జిల్లా కన్వినర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఎం.పి.పి మెండెం లలిత, వైస్ఎం.పి.పి సామినేని సురేష్, ఖమ్మంపాడు సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ విద్యాలత, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ రంజిత్ కుమార్, ఖమ్మం ఆర్.డి.ఓ రవీంధ్రనాద్, జిల్లా సహకార శాఖ అధికారి విజయకుమారి, మున్సిపల్ కమీషనర్ ఏ.రమాదేవి, వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.