Telugu News

మధిరలో కోల్డ్ స్టోరేజ్ యజమాన్యంపై హిజ్రాల ముకూమ్మడి దాడి

దసరా మామూళ్ల పేరుతో బీభత్సం

0

మధిర కోల్డ్ స్టోరేజ్ యజమాన్యంపై హిజ్రాల ముకూమ్మడి దాడి

== దసరా మామూళ్ల పేరుతో బీభత్సం

== భారీగా డబ్బులు డిమాండ్ చేశారంటూ ఆరోపణ

== తీవ్రగాయాలపాలైన స్టోరేజీ సిబ్బంది

== దాడిలో పాల్గొన్న సుమారు 20 మంది హిజ్రాలు

== సంచలనంగా మారిన ఈ సంఘటన

== ఆ దాడికి తెలంగాణ హిజ్రాలకు సంబందం లేదన్న హిజ్రా సంఘం అధ్యక్షురాలు మేరి

మధిర, సెప్టెంబర్ 28(విజయంన్యూస్)

దసరా మమూళ్ల పేరుతో హిజ్రాలు బీభత్సం సృష్టించారు.  అంతా ఇంతా కాదు.. సుమారు 20 మంది హిజ్రాలు  కోల్డ్ స్టోరేజీ సిబ్బందిపై బీభత్సం చూపించారు. దొరికినోళ్లను దొరికినట్లే చితకబాదారు.. బట్టలు ఎత్తి చూపుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడి చేశారు. దీంతో కోల్డ్ స్టోరేజీ సిబ్బంది తీవ్రగాయాలపాలైయ్యారు. ఈ సంఘటన మధిర నియోజకవర్గంలో బుధవారం చోటు చేసుకోగా, ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది..

allso read- దక్షణాప్రిక పై భారత్ ఘనవిజయం

పూర్తి వివరాల్లోకి వెళ్తే మధిర మండలం ఇల్లందులపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దసరా మామూళ్ల కోసం  కోల్డ్ స్టోరేజీ కోసం 2 సుమారు 20మందికిపైగా హిజ్రాలు వచ్చి సుమారు రూ.25వేలను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఇవ్వలేనని, నన్ను వదిలేయాలని కోల్డ్ స్టోరేజ్ యజమాని చెప్పడంతో ఆయనపై దురుసుగా మాట్లాడారు.. ఇలా మాట్లాడటం సరైంది కాదని నిలదీస్తుండగా మాటమాట పెరిగి సిబ్బంది ఒకరు చేయిచేసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన హిజ్రాలు  కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై, సిబ్బందిపై  కొంత మంది హిజ్రాలు దాడి చేశారు. అంతా ఇంతకాదు.. దొరికినోళ్లను దొరికనట్లే చితకబాదారు. అక్కడ సిబ్బంది చేతులేత్తి దండం పెడుతున్నప్పటికి హిజ్రాలు వదల్లేదు. చీరలను పేకి ఎత్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ సిబ్బందిపై దాడి చేశారు. ఒక యుద్దవాతావరణమే కనిపించింది. చివరికి గాయపడిన కోల్డ్ స్టోరేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు హిజ్రాలను పంపించారు. కోల్డ్ స్టోరేజీ యజమాన్యం మధిర పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటనపై సీసీ కెమోరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కోల్డ్ స్టోరేజీ వ్యాపారులు, హామాలీలు, వర్కర్లు, వ్యాపారులు, రైతులు ఈ సంఘటపై మండిపడ్డారు. ఈఘటనను తీవ్రంగా ఖండించారు.

allso read- జీవితకాలమంతా జనంకోసం ధారపోసిన మహావీరుడు లక్ష్మణ్ బాపూజీ: మంత్రి పువ్వాడ

== స్పందించిన దోమల మేరి

మధిర లో హిజ్రాలు దాడిని తెలంగాణ హిజ్రాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దోమల మేరీ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆమె బుదవారం వాయిస్ రికార్డ్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది తెలంగాణ కు వచ్చి ఇటువంటి చర్యలకు పా లపడుతున్నరని అన్నారు. తాము అటువంటి వాటికి వ్యతిరేఖం అన్నారు..అటువంటి వారి నీ ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రస్తుతం భవాని మాలలో ఉండటం వల్ల మధిర రాలేక పోతున్న మని అన్నారు. కోల్డ్ స్టోరేజ్ వారు అర్దం చేసుకోవాలన్నారు.చట్టం ముందు అందరూ సమానులే అన్నారు.ఎవరో చేసిన తప్పులు కు హిజ్రా లు అందరినీ తప్పు పట్ట వద్దు అని పేర్కొన్నారు.తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు మానవత్వం తో అర్దం చేసు కోవాలి అన్నారు.

*** గొడవ జరిగిన వీడియోస్ చూడండి