Telugu News

శెట్టిపల్లి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం

భారీగా తరలివచ్చిన అభిమానులు

0

శెట్టిపల్లి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం

== భారీగా తరలివచ్చిన అభిమానులు

== హాజరైన ఎమ్మెల్యే రాములు నాయక్

ఏన్కూరు. మే 16 (విజయం న్యూస్)

 

ఏన్కూరు మండలం శ్రీ శ్రీ శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం స్థానిక సొసైటీ అధ్యక్షులు,మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత శెట్టిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా శెట్టిపల్లి వెంకటేశ్వరరావు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇది కూడా చదవండి:-ఎన్టీఆర్ విగ్రహంపై పాలి‘ట్రిక్స్’

తొలుత గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శెట్టిపల్లి వెంకటేశ్వరరావు పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. పూజలు చేసిన అనంతరం భారీ సంఖ్యలో నాచారం దేవాలయానికి చేరుకున్నారు. మండు టెండలను సైతం లెక్కచేయకుండా శెట్టిపల్లి అభిమానులు తరలి రావడం విశేషం. నాచారం దేవాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్,, సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు పూజలు చేశారు.

ఇది కూడా చదవండి:- కర్టాటక సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ దే

అనంతరం శెట్టిపల్లి వెంకటేశ్వరరావు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలతో పాటు, ఇతర వాహనాల్లో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్యాలాలు నాయక్, మేడ ధర్మారావు, పఠాన్ మజీద్ ఖాన్ , ఎంపీటీసీలు శెట్టిపల్లి రాధమ్మ, చీరాల కృష్ణవేణి, గిరిబాబు, మోహన్ రావు, భూక్య చందులాల్ నాయక్,దళపతి వెంకటేశ్వరరాజు, శెట్టిపల్లి నరేష్ పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు